అన్వేషించండి

Pat Cummins on David Warner: వార్నర్ భాయ్ మెడపై వేలాడుతున్న కత్తి - టెస్టు కెరీర్‌ ముగిసినట్టేనా?

Ashes 2023: గత దశాబ్దంలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా వీర విజృంభణ చేసిన ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ టెస్టు ఇన్నింగ్స్ ఇక ముగిసిన అధ్యాయమేనా?

Pat Cummins on David Warner: 9, 36, 66, 25, 4, 1.. యాషెస్ సిరీస్‌లో భాగంగా గడిచిన ఆరు ఇన్నింగ్స్‌లలో డేవిడ్ వార్నర్  చేసిన పరుగులివి. గత  రెండేండ్లుగా  టెస్టులలో వార్నర్ వరుసగా విఫలమవుతున్నాడు. 2022 నుంచి  ఈ ఫార్మాట్‌లో వార్నర్ సగటు 25.54గా ఉంది. యాషెస్‌లో అయితే  ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్  బౌలింగ్‌ను ఫేస్ చేయడానికి నానా తంటాలు (ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సార్లు అతడి బౌలింగ్ లోనే వెనుదిరిగాడు) పడుతున్న వార్నర్‌ను  నాలుగో టెస్టు నుంచి తప్పించాలని ఆసీస్ మాజీలు గొంతెత్తుతున్నారు. వార్నర్‌కు ఇవ్వాల్సినదానికంటే ఎక్కువ అవకాశాలిచ్చారని, అయినా అతడు వాటిని వినియోగించుకోవడం లేదని  ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాళ్లు మైఖెల్ క్లార్క్, జేసన్ గిలెస్సీలు అభిప్రాయపడ్డారు. 

యాషెస్‌లో దారుణంగా విఫలమవుతున్న వార్నర్ గురించి గిలెస్పీ డైలీ మెయిల్‌కు వ్యాసం రాస్తూ.. ‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే  వార్నర్ ప్లేస్‌లో యువ ఆటగాడు మాథ్యూ రెన్షాను ఆడించాలి.   ఆస్ట్రేలియా తర్వాత మ్యాచ్‌లో గెలవాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవాలి. 

ఇదే విషయమై క్లార్క్ స్పందిస్తూ.. ‘ఇప్పుడు వాళ్లు (ఆస్ట్రేలియా) ఏం చేస్తారో నాకు చెప్పండి. టీమ్‌లో అతిపెద్ద సమస్య డేవిడ్ వార్నర్ ఫామ్. అతడికి మద్దతుగా నిలిచిన ప్రతిసారి స్టువర్ట్ బ్రాడ్‌కు  వికెట్ తీసేందుకు అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతోంది. వార్నర్‌ను తీసేయాలా..? లేదా..? అన్న ప్రశ్నే ఎదురైతే ఎవరు ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారన్న  ప్రశ్న వస్తుంది. దానికి  బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయి.  మిచెల్ మార్ష్ ఫామ్‌లో ఉన్నాడు. నాలుగేండ్ల తర్వాత  టెస్టు జట్టులోకి వచ్చి  సెంచరీతో మెరిశాడు. స్వల్ప గాయంతో బాధపడుతున్న కామెరూన్ గ్రీన్ కూడా  నాలుగో టెస్టు వరకూ కోలుకుంటాడు.  అతడు కూడా ఓపెనింగ్ చేయగలడు.  ట్రావిస్ హెడ్ కూడా ఓపెనింగ్ చేయగల సత్తా ఉన్నోడే.  వార్నర్ లేకుంటే  ఉస్మాన్ ఖవాజాతో మార్నస్ లబూషేన్‌ను ఓపెనింగ్ చేయించి స్మిత్ మూడో స్థానంలో రావాలి. హెడ్, మార్ష్, గ్రీన్ లు  తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేయాలి...’అని చెప్పాడు. 

 

కెప్టెన్ స్పందన.. 

వార్నర్ ఫామ్‌పై వస్తున్న విమర్శలతో  టీమ్‌లో ఇకనైనా మార్పులు చేయాలని  ఆసీస్ మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో  సారథి పాట్ కమిన్స్ స్పందించాడు. లీడ్స్ టెస్టు ముగిసిన తర్వాత  కమిన్స్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి కమిన్స్ స్పందిస్తూ.. ‘మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి.  వాటన్నంటినీ బేరీజు వేసుకుంటాం. దానికి మాకు ఇంకా పది రోజుల టైమ్ (మాంచెస్టర్ టెస్టుకు)  ఉంది. అప్పటివరకూ మేం ప్రశాంతంగా  శ్వాస తీసుకుంటాం. మాంచెస్టర్ టెస్టు వరకూ గ్రీన్ కోలుకుంటాడు.  వికెట్ ను పరిశీలించిన తర్వాత మా బెస్ట్ ఎలెవన్‌ను ప్రకటిస్తాం..’అని చెప్పాడు.  

కమిన్స్ నేరుగా చెప్పకపోయినా వార్నర్ టెస్టు కెరీర్ ముగిసినట్టేనన్న వాదన వినిపిస్తోంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఫర్వాలేదనిపిస్తున్నా టెస్టులలో మాత్రం వార్నర్ వరుసగా విఫలమవుతున్నాడు. యాషెస్ సిరీస్‌కు ముందు కూడా అతడు జట్టులోకి రావడం గగనమే అనుకున్నారంతా. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ మీద నమ్మకంతో అతడిని మూడు టెస్టులలో ఆడించింది.  కానీ ప్రస్తుత ప్రదర్శనలు చూస్తుంటే వార్నర్ టెస్టు కెరీర్‌కు దాదాపు శుభం కార్డు పడ్డట్టేనని తెలుస్తున్నది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget