అన్వేషించండి

Lord Shiva Temples: జీవితంలో ఒక్కసారైనా ఈ 7 శివాలయాలను దర్శించండి.. ఆ పుణ్యక్షేత్రాల ప్రత్యేకతలు ఇవే

Lord Shiva Temples: మీరు శివ భక్తులా? అయితే మీరు జీవితంలో తప్పకుండా ఈ ఏడు శివాలయాలను తప్పకుండా దర్శించాలి. వీటి ప్రత్యేకతలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.

Lord Shiva Temples: మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ప్రతి శివభక్తుడు తమ జీవితంలో ఒక్కసారైన తప్పక సందర్శించాల్సిన ప్రసిద్ధ, చారిత్రాత్మకమైన శివాలయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

జీవితకాలంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన టాప్ 7 శివాలయాలు ఇవే: 

1. కాశీ విశ్వనాథ్ ఆలయం :

పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి, లేదా శివునికి అంకితం చేసిన దేవాలయాల్లో కాశీ విశ్వనాథ్ ఆలయం ఒకటి.  పవిత్రమైన గంగా నది పశ్చిమ ఒడ్డున వారణాసిలో ఉన్నది. ఈ అద్భుతమైన కాశీ విశ్వనాథ ఆలయం. ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ లేదా విశ్వేశ్వరర్ అని పిలుస్తారు. కాశీ విశ్వనాథుడు అంటే విశ్వానికి పాలకుడు అని అర్థం. ఈ ఆలయాన్ని సందర్శించడం, పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడం విముక్తి లేదా మోక్షం లభిస్తుందని నమ్ముతుంటారు. జీవితంలో చేసిన పాపాలు తొలగిపోవాలంటే కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవాలని పెద్దలు చెబుతుంటారు. జీవితంలో ఒక్కసారైన కాశీని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. 

2. తుంగనాథ్ ఆలయం :

ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం రుద్రప్రయాగ్ జిల్లాలో తుంగనాథ్ అద్భుతమైన పర్వతాల మధ్య ఉంది. ఈ ఆలయం 3680 మీటర్ల ఎత్తులో ఉంది. దాదాపు ఒక సహస్రాబ్ది కాలం నాటిది. ఈ ఆలయాన్ని పంచ కేదార్లలో ఒకటిగా భావిస్తారు. అర్జునుడు (మూడవ పాండవ యువరాజు) ఈ ఆలయానికి పునాది రాయి వేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తర భారత నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం చుట్టూ వివిధ దేవుళ్లకు అంకితం చేసిన పన్నెండు మందిరాలు ఉన్నాయి.

3. మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం:

తమిళనాడులోని మదురైలో వైగై నది దక్షిణ ఒడ్డున పురాతన మీనాక్షి అమ్మన్ ఆలయం ఉంది. సుమారుగా 1623, 1655 మధ్య నిర్మించిన ఈ ఆలయం  అద్భుతమైన నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మీనాక్షి ఆలయంలో ప్రధాన దేవతలు దేవి పార్వతి, మీనాక్షి,శివుడు కొలువై ఉన్నారు. ఈ దేవాలయం దేవుణ్ణి, అమ్మవారిని ఒకేసారి పూజించడం వల్ల మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటుంది.

4. లింగరాజ్ దేవాలయం:

భువనేశ్వర్‌లో ఉన్న పురాతన దేవాలయం లింగరాజ్ ఆలయం. ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో జజాతి కేశరి రాజుచే నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. దాని పేరు సూచించినట్లుగా, శివునికి అంకితం చేశారు. ఇక్కడ లింగం, శివుని అభివ్యక్తి, సహజంగా ఉద్భవించిందని చెబుతున్నారు. 

5. లేపాక్షి ఆలయం:

వీరభద్ర దేవాలయం అని కూడా పిలిచే ఈ అద్భుతమైన లేపాక్షి దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉంది. ఇది అద్భుతమైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఇది పైకప్పుపై అమర్చిన స్తంభాలు, ఆశ్చర్యం కలిగించే గుహలు ఉంటాయి.  వీరభద్ర క్షేత్రం కేంద్రంగా పనిచేసిన లేపాక్షి సాంస్కృతికంగా, పురావస్తుపరంగా ముఖ్యమైనది. ఇది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేది.

6. ద్రాక్షారామం :

దేశంలోని శివునికి అంకితం చేసిన ఐదు అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన ఆలయాలలో ఒకటి ద్రాక్షారామం ఆలయం. ఇది గోదావరి తూర్పు ఒడ్డున ఉంది. రాజమండ్రి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ  ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

7. మల్లికార్జున స్వామి ఆలయం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం శ్రీశైలం ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివపార్వతులు కొలువై ఉన్నారు. పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయం హిందూమతంలో శైవమతం, శక్తిమతం రెండింటికీ ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Embed widget