Vastu/Veedhi Potu: ఈ వైపు వీధిపోటు ఉంటే యజమానికి మరణం, ఆ ఇంట వారసులు ఉండరు
వీధి పోటు- రోడ్డు పోటు-వీధి శూల..ఒక్కొక్కరు ఒక్కోలా అంటారు. కానీ ఏదైనా ఒకటే. వాస్తవానికి చెప్పాలంటే వీధి పోటు నాలుగు దిక్కుల్లో ఉండొచ్చు..నాలుగు దిక్కుల్లో ఉండకూడదు. అర్థమై కానట్టుందా…ఇది చూడండి..
వీధి పోట్లలో చాలా రకాలు ఉన్నాయి. చాలా వరకు వీధిపోట్ల వల్ల ఇబ్బందులు తలెత్తితే, మరికొన్ని రకాల వీధి పోట్లు వల్ల శుభఫలితాలుంటాయి. వీధిలో వెళ్లేవారి అందరి దృష్టీ ఆ ఇంటిపై పడేలా నిర్మాణం ఉంటే దాన్ని వీధి పోటు అంటారు. కొన్ని వీధిపోట్లు అక్కడకవరకూ వచ్చి నిలిచిపోతుంటే.. మరికొన్ని అక్కడి వరకూ వచ్చి పక్కకు తిరుగుతాయి. మరికొన్ని స్థలం మూలల్ని తాకుతూ ముందుకు పోతాయి.
Also Read: ఈమె కూడా బ్రహ్మంగారిలానే.. ఏం జరగబోతుందో ముందే చెప్పేస్తుంది..
వీధి పోటు ఇలా ఉంటే మంచిది..
ప్రతి దిక్కుని మూడు భాగాలు చేయాలి- దిగువ పక్క మూడో భాగంలో వచ్చే రోడ్డు పోటు మంచిది
తూర్పు వైపు - తూర్పుఈశాన్యం
ఉత్తరం- ఉత్తర ఈశాన్యం
పడమర- పడమర వాయువ్యం
దక్షిణం- దక్షిణ ఆగ్నేయం
ఈ రోడ్డు పోట్లు మంచివే కానీ ఇవి కూడా బాల్కనీ, ఖాళీజాగాకి రావొచ్చు కానీ.. రాజద్వారానికి రాకూడదు.
Also Read: ఆమె చెబితే జరిగిపోతుందంతే.. 2022లో కరోనాని మించిన ప్రాణాంతక వైరస్..
వీధి పోటు ఎటు ఉంటే ఎలాంటి ఫలితం
తూర్పు వైపు రోడ్డు పోటు
తూర్పుకి ఉంటే - మనశ్సాంతి ఉండదు
తూర్పు ఆగ్నేయం- ఇల్లాలి ఆరోగ్యం చెడిపోతుంది, మనశ్సాంతి ఉండదు
తూర్పు ఈశాన్యం- మనశ్సాంతి, ఐశ్వర్యం
Also Read: మధుబన్ లో ఏం జరిగింది, సన్నీ లియోన్ సాంగ్ పై ఎందుకీ వివాదం..
దక్షిణం
దక్షిణం- యజమానికి మరణం, ఇంట్లో ఉన్న మగపిల్లాడికి మరణం
దక్షిణ ఆగ్నేయం- ఇంట్లో అందరి ఆరోగ్యం బావుంటుంది
దక్షిణ నైరుతి- వారసులు బతికి ఉండరు
Also Read: అసలు గుడికి ఎందుకు వెళ్లాలి, ఇంత పరమార్థం ఉందా..!
పడమర
పడమర- దంపతుల మధ్య కలహాలు, విడిపోతారు, అవివాహితులకు పెళ్లిళ్లు కావు
పడమర నైరుతి -అప్పుల పాలు
పడమర వాయువ్యం- రాజయోగం, రాజకీయ నాయకులకు మంచిది
Also Read: ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఏ దేవుడికి ఎన్ని చేయాలో తెలుసా..
ఉత్తరం
ఉత్తర వాయువ్యం- ఇంట్లో నిత్యం కలహాలు
ఉత్తరం- ఆస్తి నష్టం, కోర్టు కేసులు
ఉత్తర ఈశాన్యం- యజమానికి ఆయుష్షు పెరుగుతుంది, ఇంట్లో మనశ్సాంతి ఉంటుంది.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
రోడ్డు పోట్లు అంటే ఏంటి.. నష్టాలు ఎందుకు జరుగుతాయి
రోడ్డు ఇంటికి అభిముఖంగా వచ్చి తగలడాన్ని రోడ్డు పోటు అంటారు.
రోడ్డు పోటు వచ్చిన రహదారి వెడల్పు కన్నా మధ్యలో ఇంకో పెద్ద రోడ్డు ఉంటే ఆ రోడ్డు పోటు ప్రభావం ఉండదు.
ఆ రోడ్డు నుంచి చాలా ఎక్కువ మంది వెళ్లడం వల్ల వారి చూపు, ఆ ఇంటిపై పడి ఆ ఇంటి లక్ష్మీస్థానానికి యజమాని దూరమవుతాడు. అందుకే రోడ్డు పోటు ఉండకూడదు అంటారు.
రోడ్డు పోటు వల్ల ఇబ్బందులు తొలగాలంటే..
రోడ్డు పోటుకి అభిముఖంగా వినాయక విగ్రహం పెట్టాలి. వాస్తు పూజలు చేయించాలి.
Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు.. గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి