By: ABP Desam | Published : 27 Dec 2021 12:26 PM (IST)|Updated : 27 Dec 2021 12:26 PM (IST)
Edited By: RamaLakshmibai
Baba Vanga Predictions 2022
ఒక్కోదేశంలో ఒక్కో పద్ధతి అన్నట్టు.. మన దేశంలో పంచాగాన్ని నమ్ముతాం. రాశులు, నక్షత్రాలు, గ్రహస్థితి ఆధారంగా ఏం జరగబోతుందో చెబుతుంటారు పంచాంగ కర్తలు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యవాణి చెప్పేవారు చాలామంది ఉంటారు. అందరికన్నా వాంగబాబా జ్యోతిష్యం చాలా ప్రసిద్ధి అంటారు. గతంలో ఆమె చెప్పిన విషయాలన్నీ నిజం కావడంతో రానున్న ఏడాది ఏం చెప్పబోతున్నారో అనే ఆసక్తి ఉంది. ఊహించకుండా మంచి జరిగితే సంతోషమే కానీ.. అనర్థం జరిగితే మాత్రం అల్లాడిపోతాం. 2022 లో జరగబోయే అనర్థాల గురించి బాబా వంగా ఏ చెప్పిందంటే...
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
2022 ఏడాదిలో జరగబోయే అనర్ధాలివే..
1. 2022లో ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, సునామీ, ఇతర ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా , ఆసియా దేశాల్లో వరదలతో సహా ప్రకృతి వైపరీత్యాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
2. ‘ఓమువామువా’ అనే గ్రహశకలం భూమిపైకి వచ్చి..అందులోంచి గ్రహాంతరవాసులు మన నగరాలపై బాంబులతో దాడి చేసి..మానవులను ఖైదీలుగా బంధిస్తారట.
3. ఇప్పటికే చైనా నుంచి వచ్చిన కరోనా రెండేళ్లుగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే... రానున్న ఏడాది సైబీరియా నుంచి ప్రాణాంతకమైన వైరస్ వస్తుందన్నారు బాబా వంగా. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వైరస్‌లు మరింత విజృంభిస్తాయట.
4. నీటి కొరత, జనాభా, కాలుష్యం పెరగడంతో తాగునీటి కోసం అష్టకష్టాలు పడతారట. ఒక్కమాటలో చెప్పాలంటే ఏడాదంతా సమ్మర్లానే ఉంటుందట.
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
5. అంగారకుడిపై మనుషులు పెద్ద పెద్ద కాలనీలే ఏర్పాటు చేసుకుంటారట. ఇదో పెద్ద అణ్వాయుధ దేశంగా మారి 2170 తర్వాత భూమి నుంచి స్వాతంత్రం పొందేందుకు ప్రయత్నిస్తుందట.
6. మిడతల దాడి ఈ ఏడాది కూడా తప్పదంటోంది బాబా వంగా. మిడతల దాడిలో భారీగా పంటనష్టం జరుగుతుందట. 2020లో రాజస్థాన్, గుజరాత్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాలను మిడతల దండు వణికించింది.
7. భూ ప్రపంచంపై డ్రాగన్ ఆధిపత్యం సాధిస్తుంది. మానవత్వం లేకుండా ప్రవర్తించే డ్రాగన్ కు వ్యతిరేకంగా మూడు పెద్ద శక్తులు ఏకమై అల్లకల్లోలం సృష్టిస్తాయట.
8.వాస్తవ దృశ్యాలకు వర్చువల్ రియాలిటీకి మధ్య గందరగోళానికి గురౌతారు
9. వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమైన కరువు కాటకాలు సంభవించి మనుషులు ఆకులు, మట్టి తిని ప్రాణాలు కోల్పోతారట.
10. మంచుకొండల్లోని హిమనీనదాల్లో ప్రాణాంతక వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొంటారని.. ఇది వేగంగా వ్యాపించి భారీగా మానవుల, జంతువుల మరణాలకు కారణమవుతుంది.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
2021 లో బాబా వంగా చెప్పిన విషయాల్లో నిజమైనవి ఇవే...
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
Today Panchang 17th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఆంజనేయ అష్టోత్తరం
Horoscope Today 17th May 2022: ఈ రాశివారికి గ్రహాల అనుగ్రహం పుష్కలంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు
Astrology: మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై
AP PCC New Chief Kiran : వైఎస్ఆర్సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్గా మాజీ సీఎం !?
Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు