(Source: Poll of Polls)
Significance Of Ugadi 2023: శ్రీ శోభకృత్ నామసంవత్సర ఉగాది ఎప్పుడొచ్చింది, పంచాంగ శ్రవణం ఎందుకు!
Sri Sobhakritu Nama Samvatsaram: శ్రీ శుభకృత్ నామ సంవత్సరం పూర్తిచేసుకుని శ్రీ శోభకృత్ అడుగుపెడుతున్నాం. మార్చి 22 బుధవారం పాడ్యమి తిధి. ఈ రోజు నుంచి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం...
Significance Of Ugadi 2023: శ్రీ శోభకృత్ నామసంవత్సర ఉగాది ఈ ఏడాది మార్చి 22 బుధవారం వచ్చింది. ఆ ముందురోజు అంటే.. శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో చివరి రోజు వచ్చే ఫాల్గున మాస అమావాస్యను కొత్త అమావాస్య అంటారు. ఈ రెండు రోజులూ సందడే..
ఉగాది విశిష్ఠత
“ఋతూనాం కుసుమాకరాం”
అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో స్వయంగా చెప్పాడు. అంటే తానే వసంతఋతువునని అర్థం. వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా చైత్రమే. అయితే చైత్రమాసం అనగానే ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి కానీ దశావతారాల్లో మొదటి అవతారం అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ లాంటి విశిష్టమైన రోజులెన్నో ఈ నెలలో ఉన్నాయి. అందుకే చైత్రం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , ఎన్నో ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసంగా కూడా చెబుతారు. ఈ నెలలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు.
Also Read: అప్సరసలా ఉంది అంటారు కదా - ఎందుకు, అసలు వాళ్లెవరు!
వసంతాగమనం
ప్రకృతి చిగురించే ఈ వసంతకాలాన్ని చెట్లూ , చేమలే కాదు , పశుపక్ష్యాదులు కూడా స్వాగతిస్తాయి. సంవత్సరానికి యుగం అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది అంటారు... కాలక్రమేణా ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుంచీ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఉగాది రోజు నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. భక్తితో భగవంతుడికి నమస్కారం చేసుకుని ఉగాది పచ్చడి తినాలి.
సృష్టి మొదలు అయిన రోజు ఉగాది
సృష్టి మొదలు అయిన రోజు ఉగాది అని చెబుతారు. అందుకే సృష్టికి మూలకారకుడైన బ్రహ్మని పూజించి తమ జీవితంలో అన్ని రుచులూ ఉండాలని కోరుతూ షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవిస్తారు. ఈ రోజ పంచాంగ శ్రవణం , తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం, కవి సమ్మేళనం పండుగకు మరింత శోభ తీసుకొస్తాయి.
Also Read: ప్రేమ, క్షమ, ఆత్మాభిమానం, సహనానికి కేరాఫ్ - అందుకే యుగయుగాలకు ఆమె ఆదర్శం
కొత్త అమావాస్య
ఫాల్గుణ మాసం చివరి రోజు, ఉగాది ముందురోజు వచ్చే అమావాస్యను కొత్త అమావాస్య అంటారు. చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య ఇది. ఆ తర్వాతి రోజునుంచి కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. సాధారణంగా ప్రతినెలలోనూ అమావాస్య రోజు పితృదేవతలకు పిండప్రదానాలు చేయడం, తర్పణాలు వదలడం చేస్తుంటారు. అలాంటి విశిష్టమైన అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి. అమావాస్య రోజు ఆలోచనలు, ఏకాగ్రత చాలా తీక్షణంగా ఉంటాయి. ఆ రోజు జప తపాలకు విశేష ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల మనసు చెడు ఆలోచనలకు దూరంగా సాత్విక భావనతో ఉంటుంది. అమావాస్య రోజు సంకల్ప బలం బలంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు భగవంతుడిని ధ్యానిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం పొందుతారని చెబుతారు