News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sri Rama Navami 2023: కష్టాలు, ఇబ్బందులు తొలగించి మానసిక ప్రశాంతత, సంతోషాన్నిచ్చే శ్రీరామ రక్షా స్త్రోత్రం

Sri Rama Raksha Stotram :మార్చి 30న శ్రీరామనవమి. ఈ రోజున శ్రీ రామరక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది. నిత్యం చదువుకుంటే ఇంకా మంచిజరుతుందని చెబుతారు పండితులు..

FOLLOW US: 
Share:

Sri Rama Raksha Stotram : శ్రీ రామచంద్రుడి కృపకోసం భక్తులు పరిపరివిధాలగా పూజిస్తారు. ఎన్నో శ్లోకాలు చదువుతారు, స్తుతిస్తారు. అయితే  రామరక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల మనిషి జీవితంలో వచ్చే అనేక రకాల కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. ముఖ్యంగా శ్రీరామ నవమి రోజు ఉదయాన్నే స్నానమాచరించి ఇంట్లో అయినా, గుడిలో అయినా రామచంద్రుడి దగ్గర నేతితో దీపం వెలిగించి...ఓ ఆసనంపై ప్రశాంతంగా కూర్చుని రామ రక్షాస్తోత్రం పఠించాలి. చదవడం రానివారు.. ఎవరైనా చదివినప్పుడు విన్నాకానీ ఫలితం దక్కుతుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం భక్తిశ్రద్ధలతో జపించేవారి పాపాలు నశించడమే కాదు...ఆ శ్రీరాముడి రక్ష ఎల్లవేళలా ఉంటుంది. ఈ స్త్రోత్రం చదివిన వారు మానసిక ప్రశాంతత పొందుతారు..వారి జీవితంలో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి. సమస్యలను అధిగమించాలనే సంకల్పంతో ఉన్నవారు నిత్యం 11సార్లు చదువుకుంటే చాలా మంచిది. 

నిరుద్యోగులు, శత్రుభయం కలిగినవారు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు, కోర్టు వ్యాజ్యాలు నడుస్తున్నవారు, ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపార పరమైన సమస్యలలో చిక్కుకుని సతమతమవుతున్నవారు, మానసిక ఒత్తిడులకు గురవుతున్నవారు ఇలా ...జీవితంలో ఉండే ఏ ఇబ్బంది నుంచి అయినా ఉపశమనం శ్రీరామ రక్షా స్తోత్రం

Also Read: 2023 ఏప్రిల్ నెల రాశిఫలాలు - ఈ 6 రాశులవారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, అన్నీ అనుకూల ఫలితాలే!

శ్రీ రామ రక్షా స్తోత్రం
ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య
బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమద్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ॥

ధ్యానం
ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ ।
వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ॥

స్తోత్రం
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ।
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ॥ 1 ॥

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ ।
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ ॥ 2 ॥

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్ ।
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ ॥ 3 ॥

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ ।
శిరో మే రాఘవః పాతు ఫాలం (భాలం) దశరథాత్మజః ॥ 4 ॥

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియః శృతీ ।
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ 5 ॥

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః ।
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ 6 ॥

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ ।
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ॥ 7 ॥

సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్-ప్రభుః ।
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ ॥ 8 ॥

జానునీ సేతుకృత్-పాతు జంఘే దశముఖాంతకః ।
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః ॥ 9 ॥

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ ।
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥ 10 ॥

పాతాళ-భూతల-వ్యోమ-చారిణ-శ్చద్మ-చారిణః ।
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ॥ 11 ॥

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ॥ 12 ॥

Also Read: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్ ।
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ॥ 13 ॥

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ ।
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ ॥ 14 ॥

ఆదిష్టవాన్-యథా స్వప్నే రామరక్షామిమాం హరః ।
తథా లిఖితవాన్-ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః ॥ 15 ॥

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ ।
అభిరామ-స్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ॥ 16 ॥

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ ।
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ॥ 17 ॥

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ ।
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 18 ॥

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ ।
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ॥ 19 ॥

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ ।
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ॥ 20 ॥

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా ।
గచ్ఛన్ మనోరథాన్నశ్చ (మనోరథోఽస్మాకం) రామః పాతు స లక్ష్మణః ॥ 21 ॥

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ ।
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ॥ 22 ॥

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః ।
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ॥ 23 ॥

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః ।
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ॥ 24 ॥

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాససమ్ ।
స్తువంతి నాభి-ర్దివ్యై-ర్నతే సంసారిణో నరాః ॥ 25 ॥

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ ।
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ ॥ 26 ॥

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ।
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥ 27 ॥

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ ।
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥ 28 ॥

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి ।
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ॥ 29 ॥

మాతా రామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః ।
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ జానే న జానే ॥ 30 ॥

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ (తు) జనకాత్మజా ।
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ॥ 31 ॥

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథమ్ ।
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే ॥ 32 ॥

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ ।
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥ 33 ॥

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్ ।
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ॥ 34 ॥

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ ॥ 35 ॥

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్ ।
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ ॥ 36 ॥

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః ।
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ॥ 37 ॥

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ॥ 38 ॥

ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణమ్ ।
శ్రీరామ జయరామ జయజయరామ ।

Published at : 29 Mar 2023 11:44 AM (IST) Tags: importance of Srirama Navami significance of Srirama Navami Sri Rama Navami date time Sri Rama Navami pooja vidhi lord sitarama kalyanam RAM NAVAMI March 30 Sri Rama Navami 2023 Significance of Ramnavami 2023 Sri Rama Rama Rameti slokam Sri Vishnu Sahasranama Stotram Happy Ram Navami Wishes in telugu

ఇవి కూడా చూడండి

Christmas Celebrations 2023: క్రిస్మస్ వేడుకలలో ఈ రంగులు చాలా ప్రత్యేకం - ఎందుకంటే!

Christmas Celebrations 2023: క్రిస్మస్ వేడుకలలో ఈ రంగులు చాలా ప్రత్యేకం - ఎందుకంటే!

Chanakya's 31 Member Cabinet: చాణక్యుడి హయాంలో 31 మంది మంత్రులు - వారి శాఖలు ఇవే!

Chanakya's 31 Member Cabinet: చాణక్యుడి హయాంలో 31 మంది మంత్రులు - వారి శాఖలు ఇవే!

Chanakya Niti In Telugu: చాణక్య నీతి: ఈ ముగ్గురికి ఎప్పుడూ సహాయం చేయకూడ‌దు!

Chanakya Niti In Telugu: చాణక్య నీతి: ఈ ముగ్గురికి ఎప్పుడూ సహాయం చేయకూడ‌దు!

Astrology: ఈ రాశులవారు రహస్యాన్ని రహస్యంగా ఉంచలేరు!

Astrology: ఈ రాశులవారు రహస్యాన్ని రహస్యంగా ఉంచలేరు!

Daily Horoscope Today Dec 7, 2023 : మీ జీవిత భాగస్వామి మాటలను తేలికగా తీసుకోకండి, డిసెంబర్ 7, 2023 రాశిఫలాలు

Daily Horoscope Today Dec 7, 2023 :  మీ జీవిత భాగస్వామి మాటలను తేలికగా తీసుకోకండి, డిసెంబర్ 7, 2023 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?