By: RAMA | Updated at : 29 Mar 2023 07:23 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pinterest
Sri Rama Navami Wishes In Telugu 2023: మనిషిగా జన్మించాక ఎలాగో ఒకలా బతికేయడం కాదు..ఎలా బతకాలో తెలుసుకోవాలి. ఎలాంటి జీవితం గడపాలి, వ్యక్తిత్వం ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, బంధుమిత్రులతో ఎలా మెలగాలి, చుట్టుపక్కలవారితో ఎలా మమేకమవ్వాలి, కష్టసుఖాల్లో ఎలా ముందుకు సాగాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఇన్ని లక్షణాలు ఒక్కరికే ఉండడం సాధ్యమా అంటే ఈ ప్రశ్నకు ఒకేఒక్క సమాధానం శ్రీరామచంద్రుడు. మార్చి 30 గురువారం శ్రీరామనవమి. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడిని స్మరిస్తూ మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
Also Read: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!
ధర్మ బద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు
మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి
మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
రాముడు అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం
మరో అడుగు వేస్తే అది సత్యం
ఆయన నడక ఆయన కదలిక అంతా సత్యం ధర్మమే
అందుకే “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని
శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాళాత్మక పరమేశ్వర రామ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కళాత్మక పరమేశ్వరా రామ
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
శ్రీ రామ జయరామ జయ జయ రామ!
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్ ||
అందరకీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
సీతారాముల కల్యాణం చూసి తరించిన వారి జన్మ సార్దకం
శ్రీ సీతారాముల అనుగ్రహంతో మీకు సర్వదోషాలు తొలగపోవాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
Also Read: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!
దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ||
శ్రీరామనవమి శుభాకాంక్షలు
అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం
రామ నామ జపం మీ ఇంట నింపాలి ఆనందం
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం
అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం.
మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన నిఘంటువు రామాయణం
శ్రీరామనవమి శుభాకాంక్షలు
శేష తల్ప సుఖ నిద్రిత రామ
బ్రహ్మాద్యామర ప్రార్ధిత రామ
శేష తల్ప సుఖ నిద్రిత రామ
బ్రహ్మాద్యామర ప్రార్ధిత రామ
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి,
తన్నో రామ ప్రచోదయాత్
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
Weekly Horoscope 29 May to 04 June: జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!
మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది
NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!
Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!
మే 27 రాశిఫలాలు, ఈ రోజు రాశులవారు మంచి గుర్తింపు పొందుతారు!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!