(Source: Matrize)
Spirituality: ఉద్యోగం, వ్యాపారం, విద్య, సంతానం- మీ సమస్యను బట్టి మీరు పఠించాల్సిన శ్లోకాలివే
ఒకరికి నిరుద్యోగ సమస్య, మరొకరికి ఉద్యోగ సమస్య, ఇంకొకరికి అనారోగ్య సమస్య ఇలా చెప్పుకుంటే సంతాన సమస్య, చదువు సమస్య, ఆర్థిక సమస్య ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడనుకుంటే సరిపోదు. ఎందుకంటే...
అన్నింటికీ ఆదేవుడే ఉన్నాడనుకుంటే సరిపోదు..మీ సమస్యను బట్టి మీరు పూజించాల్సిన దేవుడు మారతాడు. పఠించాల్సిన శ్లోకం వేరే ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారంగా కింద చెప్పిన శ్లోకాలు చదువుకుంటే మంచి ఫలితాలుంటాయి.
దక్షిణామూర్తి శ్లోకం
ఇంట్లో దక్షిణామూర్తి చిత్రపటం పెట్టి నిత్యం పదినిముషాలైనా భక్తితో ఆయన్ని పూజిస్తే అపమృత్యు భయం తొలగిపోతుందని చెబుతారు. మేధాశక్తి పెరగడంతో పాటూ ధారణ, స్పష్టత కలుగుతుంది. విద్యార్థులకు మాత్రమే కాదు అన్ని వయసుల వారికీ ఇది వర్తిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి, సత్వగుణం వృద్ధి చెందుతుంది. ప్రారబ్ధ కర్మలు, దుష్కర్మల ఫలితం తగ్గుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
శ్రీ గురు ధ్యానం :
ఓం......
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః,
గురు దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పర బ్రహ్మా,
తస్మై శ్రీ గురవే నమః ||
ఓం......
గురవే సర్వలోకానాం,
భిషజే భవరోగిణామ్ |
నిధయే సర్వవిద్యానాం,
దక్షిణామూర్తయే నమః ||
విష్ణు సహస్రం-లలితా సహస్ర నామ స్త్రోతం
విష్ణు, లిలతా సహస్రనామ స్తోత్రాలు పఠిస్తే కుటుంబసభ్యుల మధ్య విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి అందరి మధ్యా సత్సంబంధాలు నెలకొంటాయి. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందట.
కనకధారా స్తోత్రం..
"కనకధార స్తోత్రం"ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతోపాటు...నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి.
సూర్యాష్టకం-ఆదిత్య హృదయం
ప్రతిరోజూ "సూర్యాష్టకం, ఆదిత్య హృదయం" చదువుతూ.. "సూర్యధ్యానం" చేస్తే ఆరోగ్యంతో పాటూ కెరీర్ పరంగానూ మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగం చేస్తున్నవారు చదివితే ఉన్నత స్థానం పొందుతారు, ఉద్యోగం లేనివారు నిత్యం పఠిస్తే మంచి అవకాశాలు పొందుతారు.
Also Read: ఇలాంటి కల వస్తే ఆరునెలల్లో చనిపోతారట!
లక్ష్మీ అష్టోత్ర శతనామావళి
లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నిత్యం పారాయణం చేస్తే ఇంట్లో సరిసంపదలకు లోటుండదు. పిల్లలు మంచి సద్గుణాలు కలిగి ఉంటారు. ఇంట్లో అవివాహితులుంటే మంచి సంబంధం కుదురుతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి పనులు జరుగుతాయి.
నవగ్రహ స్తోత్రం..
నవగ్రహ స్తోత్రం నిత్యం చదువుకుంటే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతికూలంగా ఉన్న గ్రహాల ప్రభావం తగ్గుతుంది.
హాయగ్రీవ స్తోత్రం-సరస్వతి ద్వాదశ నామాలు
విద్యార్థులు మంచి విద్యను పొందడానికి, చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి, చదివినది గుర్తుంచుకోవడానికి నిత్యం "హయగ్రీవ స్తోత్రం", "సరస్వతి ద్వాదశ నామాల"ను పఠించాలి.
గోపాల స్తోత్రం
సంతానం కోసం చెట్టు పుట్ట చుట్టూ తిరుగుతున్న వారు నిత్యం గోపాల స్త్రోత్రం పఠించే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కడుపుతో ఉన్నవారు ఈ స్తోత్రం నిత్యం చదివితే సుఖ ప్రసవం అవుతుందని, సంతానం ఆరోగ్యంగా పుడతారని పండితులు చెబుతున్నారు.
Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?
Also Read: పాండవుల విజయం కోసం అర్జునుడి కొడుకును పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు