Spirituality: సూర్యాస్తమయం తర్వాత ఇలా చేస్తే లెక్కలేనన్ని నష్టాలు. ఈ పనులు మీరు చేయకండి
Donts After Sunset: సూర్యోదయం, సూర్యాస్తమయం అత్యంత పవిత్రమైన సమయాలు. సూర్యాస్తమయ సమయంలో కొంతమంది దేవతలు విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో ఏం చేయాలి..? ఏం చేయకూడదు..?
Donts After Sunset: సనాతన సంప్రదాయంలో అదృష్టం పొందడానికి, దురదృష్టాన్ని నివారించడానికి, ప్రతి పనిని సమయానుసారంగా చేయాలని సూచించారు. హిందూ ధర్మం ప్రకారం, సూర్యోదయం వంటి, పూజలకు సంబంధించిన కొన్ని చర్యలతో పాటు రోజువారీ జీవితానికి సంబంధించిన నియమాలు సూర్యాస్తమయ సమయానికి కేటాయించారు. ఈ నియమాలను పాటించకపోవడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో సంతోషం, శాంతి, శ్రేయస్సు కలగాలంటే సూర్యాస్తమయం సమయంలో ఆ తర్వాత ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకుందాం.
Also Read : సూర్యస్తమయం వేళ ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే!
దుస్తులు ఉతకవద్దు
హిందూ ధర్మం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత దుస్తులు ఉతకడం, ఆరబెట్టడం శుభప్రదంగా భావించరు. సనాతన ధర్మం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత దుస్తులు ఆరుబయట ఆరబెట్టడం వల్ల ప్రతికూల శక్తి వాటిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా వ్యక్తి దుఃఖాన్ని, దురదృష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
నిద్రపోవద్దు
హిందూ విశ్వాసాల ప్రకారం, ఒక వ్యక్తి సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు. జబ్బుపడినవారు, పిల్లలు తప్ప, మిగిలిన వారికి ఈ నియమం వర్తిస్తుంది. అలా చేస్తే వారి జీవితాన్ని లోపభూయిష్టంగాగా పరిగణిస్తారు. వ్యాధి, దుఃఖం, పేదరికం వారిని ముంచెత్తుతాయి. దీని వల్ల మనిషి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లవద్దు
హిందూ విశ్వాసం ప్రకారం, మీరు సూర్యాస్తమయం సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు లేదా పిల్లల కోసం ఏదైనా తీసుకోండి. సూర్యాస్తమయం సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి రావడం గొప్ప దోషంగా పేర్కొన్నారు.
గోళ్లు, జుట్టు కత్తిరించద్దు
హిందూ ధర్మం ప్రకారం, సంపదను కోరుకునే వారు సూర్యాస్తమయం తర్వాత తమ గోర్లు, జుట్టును కత్తిరించకూడదు. ఈ నియమాన్ని విస్మరించిన వారు ఆర్థికంగా నష్టాల పాలవుతారని, రుణభారం ఎదుర్కొంటారని నమ్ముతారు. సూర్యాస్తమయం సమయంలో ఈ పని చేయడం వల్ల ధన నష్టం మాత్రమే కాదు. దురదృష్టం కూడా వెన్నాడుతుంది.
చెట్లు, మొక్కలను తుంచవచ్చు
హిందువుల విశ్వాసం ప్రకారం చెట్లు, మొక్కలను దేవుని రూపాలుగా పూజిస్తారు. సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులు, కొమ్మలు మొదలైన వాటిని విరగగొట్టడం లేదా వాటిని మంటల్లో కాల్చడం మహా పాపంగా పరిగణిస్తారు. ఈ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటాయి. కాబట్టి వారిని బాధపెట్టడం సరికాదు.
అంత్యక్రియలు చేయవద్దు
హిందూ విశ్వాసం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత మరణించిన ఏ వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించరు. గరుడ పురాణం ప్రకారం, ఈ నియమాన్ని విస్మరిస్తే, చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించదు, తరువాతి జన్మలో చాలా బాధ అనుభవిస్తుంది. ఈ దోషం వల్ల పితృ దోషం కూడా రావచ్చు. ఎవరైనా సూర్యాస్తమయం సమయంలో మరణిస్తే మరుసటి రోజు దహనం చేయడం ఉత్తమం.
Also Read : సంధ్యాసమయం అందుకు నిషిద్ధం అంటారెందుకు!
ఇల్లు ఊడ్చవద్దు
సూర్యాస్తమయం సమయంలోను, ఆ తరువాత ఇల్లు ఊడ్చకూడదు. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. ఈ నియమాన్ని విస్మరించడం ద్వారా, ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో పేదరికాన్ని అనుభవిస్తాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.