Geetha Jayanthi 2023 : మీ రాతను నిర్ణయించుకునేది మీరే - అదే భగవద్గీత సారాశం!
Bhagavad Gita: అందరి తలరాతా దేవుడే రాస్తాడు కానీ దాన్ని ఎలా మార్చుకోవాలో మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మాత్రం మీరే...ఇదే భగవద్గీత సారాంశం. అదే భగవద్గీత బోధించే జీవిత పాఠం..
Bhagavad Gita Geetha Jayanthi 2023: భగవద్గీత అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రం. ఈ పవిత్రగ్రంధం ఆవిర్భవించిన రోజైన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబరు 23 గీతాజయంతి వచ్చింది. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం వికలమై.. రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత. ఈ పవిత్రగ్రంధ్రం ఆవిర్భవించిన రోజైన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. భగవధ్గీతలో మొత్తం 700 శ్లోకాలున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కృష్ణుడి బోధనల్లో కొన్ని మీకోసం. ముఖ్యంగా
వ్యక్తి విధిని ఏ అంశాలు నిర్ణయించగలవో శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలివే...
మీ ఆలోచనే మీ భవిష్యత్
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు బోధనల ప్రకారం దేవుడు ఎవరి విధిని ముందుగా రాయడు. ఒక వ్యక్తి విధి తన ఆలోచనలు, ప్రవర్తన, చర్యలు నిర్ణయిస్తాయి. అందుకే శ్రీకృష్ణుడు ప్రతి వ్యక్తి జీవితంలో మంచి పనులు చేయాలని సూచించాడు.
Also Read: 2024 లో ఈ రాశివారికి డబ్బుకి లోటుండదు కానీ మనశ్సాంతి ఉండదు!
మానసిక నియంత్రణ
శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రతి వ్యక్తి తన మనస్సును అదుపులో ఉంచుకోవాలని పేర్కొన్నాడు. ఎందుకంటే మనస్సును అదుపు చేసుకోలేని వారికి అదే శత్రువులా మారుతుంది. మీ ఆలోచనలు మనసుపై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మీదే. మీ ఆలోచనలే మీ సక్సెస్ కు, ఫెయిల్యూర్స్ కి మూల కారణం.
ఎవరినీ అపహాస్యం చేయొద్దు
వేరొకటి ప్రవర్తన, నడవడిక, వర్తమానం చూసి వారి భవిష్యత్ ని అపహాస్యం చేయొద్దని సూచిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఎందుకంటే కాలానికి బొగ్గును వజ్రంగా మార్చే శక్తి ఉంది.తన వర్తమానంలో ఏం జరిగిందో అనవసరం..కానీ..భవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉండొచ్చు. ఓడలు బండ్లు అవొచ్చు..బండ్లు ఓడలు అవొచ్చు. ధనవంతుడు పేదవాడు కావచ్చు, పేదవాడు ధనవంతుడు కావచ్చు.
Also Read: ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయండి
ప్రతి ప్రశ్నకూ సమాధానం
నా భక్తుడు మౌనంగా నాపై విశ్వాసాన్ని ఉంచితే.. తన మౌనానికి, తన విశ్వాసానికి నేను తప్పకుండా ప్రతిస్పందిస్తానని శ్రీ కృష్ణుడు చెప్పాడు. నాపై నమ్మకం ఉంచి ఓపికగా ఎదురుచూసే వాడిని మోసం చేయలేను అన్నది శ్రీకృష్ణుడి మాటల్లోని ఆంతర్యం
Also Read: భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు - మీకేం అర్థమైంది!
ఆత్మ ఒక్కటే స్థిరమైనది
ఈ దేహం నీది కాదు, నువ్వు ఈ శరీరానికి చెందవు అని గీతలో స్పష్టంచేశారు. ఈ శరీరం అగ్ని, నీరు, గాలి, భూమి, ఆకాశం వంటి పంచభూతాలతో నిర్మితమైంది. చివరికి వాటిలోనే కలిసిపోతుంది కానీ ఆత్మ స్థిరంగా ఉంటుంది. అందుకే ఓ మనిషి! నిన్ను నువ్వు భగవంతునికి సమర్పించుకో. నీ జీవితాన్ని ముగించడానికి ఇది ఉత్తమ మార్గం. ఆ విధంగా జీవించిన వాడు భయం, ఆందోళన, దుఃఖం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతాడని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించాడు.
Also Read: వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం టైమింగ్స్ ఇవే!