అన్వేషించండి

Vaikunta Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం టైమింగ్స్ ఇవే!

Vaikunta Ekadasi 2023 Date: 2023 డిసెంబర్ 23 శనివారం రోజు వైకుంఠ ఏకాదశి. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాల్సిన టైమింగ్స్ ఇవే...

Vaikunta Ekadasi 2023 Date and Time: వైకుంఠ ఏకాదశి తిథి రెండు రోజులు ఉండడంతో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాల్సిన టైమింగ్స్ పై కొంత గందరగోళం ఉంది. అయితే  ఏకాదశి తిథి సమయాలు గమనిస్తే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాల్సిన సమయంపై క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు పండితులు

డిసెంబరు 22 శుక్రవారం రోజు దశమి ఉదయం 9 గంటల 38 నిమషాల వరకూ ఉంది..ఆ తర్వాత నుంచి ఏకాదశి ప్రారంభమైంది. 
డిసెంబరు 23 శనివారం రోజు ఏకాదశి ఉదయం 7 గంటల 56 నిముషాల వరకూ ఉంది..

వాస్తవానికి సూర్యోదయానికి తిథి పరిగణలోకి తీసుకోవాలి.  అందుకే ముక్కోటి ఏకాదశి డిసెంబరు 23 శనివారం వచ్చింది. ఆ రోజు తెల్లవారు ఝామునుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అయితే ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఉత్తమం. లేదంటే డిసెంబరు 22 శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిథి ఉంది కాబట్టి..కొన్ని ఆలయాల్లో సాయంత్రం సమయంలో ఉత్తర ద్వార దర్శనభాగ్యం కల్పిస్తారు. అంటే డిసెంబరు 22 శుక్రవారం సాయంత్రం, డిసెంబరు 23 శనివారం ఉదయం 8 గంటల లోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోచ్చు. ఏకాదశి ఉపవాసం ఆచరించేవారు మాత్రం డిసెంబరు 23 శనివారమే నియమాలు పాటించాల్సి ఉంటుంది. 

Also Read: సుఖానికి ఆధారం ఏది - సిగ్గు అంటే ఏంటి, యక్ష ప్రశ్నలు ఇవే!

ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ప్రత్యేకం

ముక్కోటి  ఏకాదశి రోజు ఎక్కువ  మంది భక్తులు ఉత్తర ద్వారం నుంచి శ్రీమన్నారాయణుడిని దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు.  రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని.. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. 

Also Read: ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత, వైకుంఠ ఏకాదశికి ఉపవాసం ఎందుకంటే!

''వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి  ఉత్తర ద్వార దర్శనాత్ ''

ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర  ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు. అందుకే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్కరోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. అంటే దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి..ఉత్తరాయణం అంతా పగలుగా చెబుతారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసిందని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు. స్వర్గద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు...ఈ ద్వారం గుండా లోపలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకలపాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. 

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం డిసెంబరు 23నే

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాన్ని అత్యంత పుణ్యప్రదంగా ,అదృష్టంగా భావిస్తారు భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల క్షేత్రంలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 

2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

టాప్ హెడ్ లైన్స్

సింహ రాశి ఆగస్టు 16-22 వారఫలం
సింహ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కర్కాటక రాశి ఆగస్టు 16-22 వారఫలం
కర్కాటక రాశి ఆగస్టు 16-22 వారఫలం
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget