(Source: ECI/ABP News/ABP Majha)
Maha Shiva Ratri Bhuteshwar Nath: గ్లాసుడు నీళ్లు పోస్తే కరిగిపోయే బోళాశంకరుడు
బోళా శంకరుడు అభిషేకప్రియుడు. మనస్ఫూర్తిగా నమస్కారం చేసి అభిషేకం చేస్తే చాలు భక్తులను అనుగ్రహించడంలో ముందుంటాడు. అయితే ఇక్కడ శంకరుడికి అభిషేకాలు కూడా అవసరం లేదు..కేవలం గ్లాసుడు నీళ్లు పోస్తే చాలట...
తలపై గంగమ్మను పెట్టుకున్నా పరమశివుడికి అభిషేకం అంటే ఎంతో ప్రీతి. అందుకే ప్రత్యేక పూజలు అవసరం లేదు అభిషేకం ఒక్కటీ చేస్తే చాలు బోళాశంకరుడు కరిగిపోతాడట. ముఖ్యంగా కొన్ని సమస్యల్లో చిక్కుకున్న వారు అవితీరాలన్నా, కోర్కెలు నెరవేరాలన్నా భూతేశ్వర్ నాధ్ ఆలయం సందర్శించి స్వామి వారికి ఒక గ్లాసు నీటితో అభిషేకం చేస్తే చాలట. ఛత్తీస్ గడ్ రాష్ట్ర రాజధాని రాయపుర్ కి దగ్గరలో ఉన్న గరియాబంద్ జిల్లాలోని మరోడా గ్రామంలో భూతేశ్వరనాధ్ ఆలయం ఉంది. చుట్టూ దట్టమైన అడవులు, అందమైన వాతావరణం మధ్యలో స్వామి వారు లింగరూపంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పులో శివలింగం దర్శనమిస్తుంది. ఈ శివలింగం ఏటా 6 నుంచి 8 అంగుళాలు పెరుగుతుంటుందని, అందుకే రెవెన్యూ శాఖాధికారులు ఏటా శివలింగం ఎత్తును రికార్డు చేస్తారని స్థానికులు చెబుతారు. స్వామివారి దర్శనార్థం నిత్యం వేలమంది భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. సమస్యల్లో ఉన్నవారు అవితీరాలని మొక్కుకుంటూ గ్లాసుడు నీళ్లు శివలింగంపై పోస్తారట. మహాశివరాత్రి, కార్తీకమాసం లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.
Also Read: ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఏ దేవుడికి ఎన్ని చేయాలో తెలుసా..
వందల ఏళ్ల నాటి భూతేశ్వర్ నాధ్ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. జమిందారీ వ్యవస్ధ ఉన్న సమయంలో గరియాబంద్ ప్రాంతంలో శోభా సింగ్ అనే జమిందార్ ఉండేవాడు. మరోడాలో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఒక రోజు సాయంత్రం తన పొలానికి వెళ్లి వస్తుండగా ఎద్దురంకెలు, సింహం గాండ్రింపు శబ్దాలు వినిపించాయి. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో అంతా అక్కడకు చేరుకున్నారు. అక్కడ కేవలం మట్టి దిబ్బమాత్రమే ఉంది..అందులోంచి శబ్దాలు వినిపిస్తున్నట్టు గుర్తించారు. దానికి చాలా మహిమ ఉందని భావించి అప్పటి నుంచి వారంతా శివలింగంగా భావించి పూజించడం ప్రారంభించారు. అప్పటి నుంచి శివలింగం పెరుగుతూ ఇప్పుడు 18 అడుగులకు చేరిందని చెబుతారు.
Also Read: బొట్టు పెట్టుకునే అలవాటుందా .. అయితే ఈ వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట…
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
Also Read: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు చేయకూడదంటారు …ఎందుకో తెలుసా..
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి