(Source: ECI/ABP News/ABP Majha)
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
IPL Mega Auction 2025 | క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం 2025 సమయం ఆసన్నమైంది. నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ 25న సైతం వేలం జరగనుంది.
IPL Mega Auction 2025 Date and Time | ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలం నేడు ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజులపాటు ఐపీఎల్ మెగా ఆక్షన్ నిర్వహించనున్నారు. గతేడాది దుబాయ్‌లో అనంతరం విదేశాలలో ఐపీఎల్ వేలం జరగడం ఇది కేవలం రెండోసారి. ఈ మెగా వేలంలో వచ్చే మూడేళ్లకుగానూ 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను దక్కించుకునేందుకు పోటీ పడనున్నాయి. ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో ప్రదర్శనను బట్టి ఓ అంచనాతో ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అందరి కళ్లూ రిషబ్ పంత్ మీదే ఉంటాయి. మరోవైపు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్ లను సైతం తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. భారత క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లలో మిచెల్ స్టార్క్, లియామ్ లివింగ్‌స్టోన్, జోస్ బట్లర్, కగిసో రబడలపై అందరి చూపు నెలకొంది. వీరికి వేలంలో అత్యధిక ధరలు వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ప్రతి ఫ్రాంచైజీ అత్యధికంగా 25 మంది ఆటగాళ్లతో స్క్వాడ్ కంప్లీట్ చేయాలి. మొత్తం 204 మంది ఆటగాళ్లను TATA IPL 2025 మెగా వేలంలో ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి.
IPL 2025 మెగా వేలం టైమ్
సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు వేలం ప్రారంభం కానుంది.
A MEGA experience for the MEGA Auction 😎
— IndianPremierLeague (@IPL) November 24, 2024
📱 Download the Official #TATAIPL App and stay updated with the #TATAIPLAuction 🔨
Download Now ▶️ https://t.co/JkV3frKi7r pic.twitter.com/HkbrJXFixP
IPL 2025 మెగా వేలం లైవ్ స్ట్రీమింగ్ వీక్షించండి
ఐపీఎల్ 2025 మెగా వేలం ఈవెంట్‌ను జియో సినిమా యాప్ (JioCinema APP)లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానల్ లో సైతం టీవీలో చూడవచ్చు అని నిర్వాహకులు తెలిపారు.
ఐపీఎల్ మేగా వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 4న పూర్తయింది. ఐపీఎల్ వేలం కోసం మొత్తం 1574 మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా వీరిలో క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం ప్లేయర్లలో భారత ఆటగాళ్లు 1,165 మంది ఉండగా, విదేశీ ఆటగాళ్లు 409 మంది వేలంలో పాల్గొంటారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాళ్లు (క్యాప్డ్ ప్లేయర్స్) 320 మంది ఉండగా, అన్ క్యాప్డ్ ప్లేయర్లు 1,224 మంది, అసోసియేట్ దేశాల ఆటగాళ్లు 30 మంది ఉన్నారు.
ఆటగాళ్ల జాబితా..
- క్యాప్డ్ ప్లేయర్లు ఇండియన్స్ (48 మంది)
- అంతర్జాతీయ ఆటగాళ్లు (272 మంది)
- గత IPL సీజన్లలో ఆడిన అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు (152 మంది)
- గత IPL సీజన్లలో ఆడిన అన్‌క్యాప్డ్ ఇంటర్నేషనల్స్ (ముగ్గురు)
- అన్‌క్యాప్డ్ ఇండియన్స్ (965 మంది ఆటగాళ్లు)
- అన్‌క్యాప్డ్ అంతర్జాతీయ ఆటగాళ్లు (104 మంది)
Also Read: IPL 2025 Auction: రిషభ్ పంత్ కోసం విపరీతమైన పోటీ, కొత్త రికార్డులు సెట్ చేస్తాడా ? ధర గెస్ చేశారా!