PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
భారత రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, కానీ ఓ వర్గాన్ని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. నేడు వచ్చిన ఎన్నికల ఫలితాలపై శనివారం రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ ఎన్డీయే విజయంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో వక్ఫ్ చట్టం, వక్ఫ్ బోర్డు లాంటివి రాజ్యాంగంలో లేవన్నారు. కానీ ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు, ఒక్కో వర్గానికి అవసరమయ్యేలా నడుచుకునే పాలిటిక్స్‌కు వక్ఫ్ బోర్డు ఉదాహరణ అన్నారు. వాస్తవానికి భారత రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అవినీతి రహిత, పారదర్శక పాలనకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. విభజన శక్తులు, మతాలు, సామాజిక వర్గాల పేరిట రాజకీయాలు చేసే కాంగ్రెస్ లాంటి ఇండి కూటమికి చెంప పెట్టు లాంటిదని మోదీ పేర్కొన్నారు. మరియు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విభజన శక్తులు, ప్రతికూల రాజకీయాలు మరియు వంశపారంపర్యత ఓడిపోయాయని అన్నారు. సుస్థిరత కోసం ఓటేసిన మహారాష్ట్ర ప్రజలు, ప్రజలను విభజించాలని చూసిన వారికి తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు.
The seed of appeasement sown by Congress is a betrayal of the Constitution by this family.
— BJP (@BJP4India) November 23, 2024
For decades, Congress has played this same game in the country.
Congress made laws for appeasement, ignoring even the orders of the Supreme Court. One stark example of this is the Waqf…
ఐకమత్యంగా ఉంటే మనదే విజయం..
బీజేపీ ప్రధాన కార్యాయలంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ‘మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సందేశం ఏంటంటే.. మనమంతా ఐకమత్యంగా ఉంటే సురక్షితంగా ఉంటాం. "ఏక్ హై తో సేఫ్ హై" నినాదానికి ప్రజలు ఆమోదం తెలిపారు. తమ నిర్ణయాన్ని వెల్లడించిన జార్ఖండ్ ప్రజలకు సైతం నమస్కరిస్తున్నాను. వారి అభివృద్ధికి బీజేపీ మరింతగా పనిచేస్తుంది. 'ఏక్ హై తో సేఫ్ హై' అనేది దేశం మొత్తానికి ఓ నినాదంగా మారింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ, వారి కూటమి కుల, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని భావిస్తుంది. అలాంటి వారికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు గొడ్డలిపెట్టు.
రాజ్యాంగం పేరుతో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది. షెడ్యూల్డ్ కులాల వారని, షెడ్యూ్ల్డ్ తెగలవారిని, వెనుకబడిన తరగతుల వారని చిన్న చిన్న గ్రూపులుగా విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. అలాంటి వారికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు సమాధానం చెప్పాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి. కానీ ప్రజల ఆలోచన, వారి స్వభావాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు. వారు సీటు కోసం రాజకీయాలు చేస్తారు. కానీ దేశానికి తొలి ప్రాధాన్యమని గుర్తించరు. కాంగ్రెస్ చేసిన అబద్ధపు హామీలు, మోసపూరిత ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో చేసిన మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారు. బీఆర్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతం మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది.
ఆర్టికల్ 370ని తెచ్చే ప్రయత్నం జరుగుతోంది
ఎంతో శ్రమించి జమ్మూకాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ఆర్టికల్ 370 ను తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. కాంగ్రెస్, వారి మిత్రపక్షాలే కాదు.. ప్రపంచంలోని ఏ శక్తి సైతం జమ్మూకాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదా ఆర్టికల్ ను తిరిగి తీసుకురాలేరు. మన రాజ్యాంగాన్ని అవహేళన చేయలేరు’ అని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!