అన్వేషించండి

Lord Krishna: శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత అర్జునుడు ఏమయ్యాడో తెలుసా?

Lord Krishna: శ్రీకృష్ణుడు, అర్జునుడు వ‌రుస‌కు బావ‌బావ‌మ‌రుదులైనా ప్రాణ స్నేహితులు. శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత అర్జునుడు ఏమ‌య్యాడు.? అర్జునుడు కూడా చనిపోయాడా.?

Lord Krishna: హిందూ ధ‌ర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవుళ్లలో శ్రీకృష్ణుడు ముఖ్యుడు. శ్రీకృష్ణుడు నేతృత్వంలో జరిగిన మహాభారత యుద్ధంలో 100 మంది కౌరవ సోదరులు మరణించారు. దీని వల్ల ధృతరాష్ట్రుడు, గాంధారి కృంగిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..? అర్జునుడు, శ్రీకృష్ణుల జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి..?

1.గాంధారి కోపం
మహాభారత యుద్ధం తరువాత, శ్రీకృష్ణుడు హస్తినాపుర రాజభవనానికి తిరిగి వస్తాడు. శ్రీకృష్ణుడిని చూడగానే గాంధారి కోపం దుఃఖంతో అగ్నిపర్వతంలా మారింది. తన 100 మంది కుమారులైన కౌరవులను రక్షించడానికి ఏమి చేయలేదని ఆమె శ్రీకృష్ణునిపై కోపంతో ఉంటుంది.

Also Read : శ్రీకృష్ణుడికి 8 అంకెకు విడదీయరాని సంబంధం, ఎందుకో తెలుసా?

2. గాంధారి శాపం
కొడుకులను కోల్పోయిన బాధతో గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తుంది. యుద్ధంలో కౌరవులు మరణించినందున యాదవ వంశం నాశనమైపోతుందని ఆమె శపించింది. గాంధారి శాపం కారణంగా శ్రీకృష్ణుడు మరణిస్తాడు. య‌దు వంశం మొత్తం నశిస్తుంది.

3. ద్వారక నాశనం
గాంధారి తన ఒక్క శాపంతో విశ్రమించదు. ఆమె తన రెండవ శాపంగా ద్వారక నాశనం కావాల‌ని శపిస్తుంది. ఫలితంగా, శ్రీకృష్ణుడి ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతుంది.

4. శ్రీకృష్ణుని నిర్యాణం
మృత్యువు తనను వేగంగా అధిగమించడానికి ప్రయత్నిస్తోందని గ్రహించిన శ్రీకృష్ణుడు దట్టమైన అడవికి వెళ్లి అక్కడ తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎక్కడో ద్వారక. దానికి చాలా దూరంలో తపోవనం. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం వదిలాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ అందుబాటులో బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణునికి ఈ వార్త చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనానికి వచ్చాడు. తపోవనమంతా రెండురోజులు కాళ్లరిగేలా తిరిగాడు. అలా వెతగ్గా.. వెతగ్గా మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు. కానీ ప్రాణం లేకుండా.! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలి పోయాడు, రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల తన దేహాన్ని విడిచి 4-5 రోజులు గడిచాయి. ఇక ఆ మృత దేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక , అక్కడే అర్జునుడొక్కడే ఏ అర్భాటమూ లేకుండా అంత్యక్రియలు పూర్తిచేశాడు. అష్టభార్యలు, 80 మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావైన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు.

శ్రీకృష్ణుడు తనకు ఎంతో ఇష్ట‌మైన వేణువును విర‌గ్గొట్టడానికి కారణం ఎవ‌రో తెలుసా!

5. అర్జునుడి పరివర్తన
శ్రీకృష్ణుని మరణానంతరం అర్జునుడు తన శక్తులన్నింటినీ కోల్పోతాడు. కృష్ణుడి ఆత్మ ఆయ‌న‌ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఆయ‌న‌ 16,100 మంది భార్యలతో సహా ద్వారకలోని పౌరులందరినీ అర్జునుడు ఇంద్రప్రస్థానికి తీసుకువెళతాడు.

శ్రీకృష్ణుడు అర్జునుడికి అత్యంత శక్తివంతమైన బంధువు, మార్గ‌ద‌ర్శి. శ్రీకృష్ణుడు చనిపోవడంతో అర్జునుడు తన శక్తినంతా కోల్పోయి సాధారణ పౌరుడిగా మిగిలిపోతాడు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget