News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Lord Krishna: శ్రీకృష్ణుడికి 8 అంకెకు విడదీయరాని సంబంధం, ఎందుకో తెలుసా?

Lord Krishna: శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి 8వ అవతారం. 8 అంకెకు శ్రీకృష్ణుడితో గొప్ప అనుబంధం ఉంది. ఆ సంబంధం ఏమిటి? శ్రీకృష్ణుడికి 8 అంకె ఎందుకు ప్రియమైనది?

FOLLOW US: 
Share:

Lord Krishna: శ్రీ మ‌హా విష్ణువు దుష్టులను సంహరించడానికి శ్రీకృష్ణునిగా అవతరించి భూమిపై సామాన్యుడిగా జీవించాడు. శ్రీకృష్ణుడు కంసుని దుశ్చర్యలను అడ్డుకుని ప్ర‌జ‌ల‌కు అండగా నిలిచినవాడు. శ్రీకృష్ణుడిని విష్ణువు 8వ అవతారంగా పేర్కొంటారు. ఈ కారణంగా శ్రీకృష్ణుడికి 8 అంకెతో అవినాభావ సంబంధం ఉంది.

పంచాంగం, సంఖ్యా శాస్త్రాన్ని తీసుకుంటే, సంఖ్యలు మన జీవితానికి సంబంధించినవి అని చెప్పవచ్చు. మన జన్మ సంఖ్యలు కూడా మన భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని న్యూమరాలజీ చెబుతోంది. ప్రతి గ్రహం మన జాతకంలో ఒక సంఖ్యను సూచిస్తుంది. శ్రీకృష్ణుని 8వ అవతారంలోని 8 అంకె కూడా శని గ్రహంతో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడికి 8కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Also Read : శ్రీకృష్ణుడు తనకు ఎంతో ఇష్ట‌మైన వేణువును విర‌గ్గొట్టడానికి కారణం ఎవ‌రో తెలుసా!

8కి శ్రీకృష్ణునికి ఉన్న సంబంధం ఏమిటి?

1. శ్రీ కృష్ణుడు పుట్టిన రోజు రాత్రి ఏడు జాములు గడిచి ఎనిమిదవ జాములో శ్రీ కృష్ణుడు జన్మించాడు. ఆ సమయంలో రోహిణి నక్షత్రం, అష్టమి తిథి కూడా ఉన్నాయి. అష్టమి అంటే 8.

2. శ్రీకృష్ణుడు దేవకి, వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా జన్మించాడు. దేవకి వసుదేవులకు జ‌న్మించిన ఏడుగురు పిల్లలను కంసుడు చంపుతాడు. కానీ, వారి అష్ట‌మ‌ సంతానం శ్రీకృష్ణుడిని కంసుడు చంపలేకపోయాడు.

3. హిందూ ధ‌ర్మంలో శ్రీ మ‌హా విష్ణువు భూమిపై పది అవతారాలు ధ‌రించినందువ‌ల్ల‌ ఆయనను దశావతారి అని పిలుస్తారు. శ్రీ కృష్ణుడు విష్ణువు ఎనిమిదవ అవతారం. కాబట్టి 8 అంకె శ్రీ‌కృష్ణుడికి చాలా ప్రత్యేకమైనది.

4. న్యూమరాలజీ ప్రకారం, అన్ని గ్రహాలకు శనికి సంబంధించిన 8 అంకె ఉంటుంది. బహుశా అందుకే శని భగవానుడు, శ్రీకృష్ణుడు మధ్య ప్రత్యేక సంబంధం ఉంది.

5. భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీనిని శ్రీ కృష్ణుని ఉపదేశం అని కూడా పిలుస్తారు, ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. 
భ‌గ‌వ‌ద్గీత‌లో 8వ శ్లోకం  
పరిత్రాణాయ సాధూనాం వినిశాయ చ దుష్కృతం|                          
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే||

6. శ్రీ కృష్ణ భగవానుడు భూమిపై 125 సంవత్సరాలు జీవించాడని చెబుతారు. 125 అంటే 1+2+5=8 దీన్ని కూడితే మొత్తం 8.

Also Read : ఇంట్లో వాస్తు దోష నివార‌ణ‌కు స్వయంగా శ్రీ‌కృష్ణుడు చెప్పిన ప‌రిహారాలేంటో తెలుసా!

7. పురాణాల ప్రకారం, శ్రీ కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు. ఇది కాకుండా ఆయ‌న‌కు 16,100 మంది రాణులు ఉన్నారు, ఆ సంఖ్య మొత్తం క‌లిపితే 8 వ‌స్తుంది.

పై కారణాల వల్ల, 8 అంకెకు శ్రీకృష్ణుడికి విడ‌దీయ‌లేని బంధం ఉంది. బహుశా 8 అంకె శ్రీకృష్ణునికి కూడా ప్రియమైనది కావ‌చ్చు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Published at : 14 Sep 2023 07:00 AM (IST) Tags: Lord Krishna Lord Vishnu Relationship 8 number Krishna And Number 8

ఇవి కూడా చూడండి

TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్ - ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత

TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్ - ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత

Vastu Tips : ముందు ఈ వ‌స్తువుల‌ను ఇంట్లోంచి తీసేస్తే, పురోగ‌తి దానంతట అదే మొద‌ల‌వుతుంది.!

Vastu Tips : ముందు ఈ వ‌స్తువుల‌ను ఇంట్లోంచి తీసేస్తే, పురోగ‌తి దానంతట అదే మొద‌ల‌వుతుంది.!

Vastu Tips In Telugu: చనిపోయిన వారి ఫొటోలు మీ ఇంట్లో ఏ దిక్కున పెట్టారు!

Vastu Tips In Telugu:  చనిపోయిన వారి ఫొటోలు మీ ఇంట్లో ఏ దిక్కున పెట్టారు!

Horoscope Today 30 September 2023: ఈ రాశులవారు మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నించండి, సెప్టెంబరు 30 రాశిఫలాలు

Horoscope Today 30 September 2023:   ఈ రాశులవారు మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నించండి, సెప్టెంబరు 30 రాశిఫలాలు

Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?

Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ