Moodami 2025: శుభకార్యాలకు బ్రేక్! మౌఢ్యమి సమయంలో ఏం చేయాలి? ఏంచేయకూడదు? పూర్తి వివరాలు
Guru Moodam 2025 Starting and Ending Dates: మౌఢ్యం/ మూఢం ..ఇవి ఎందుకొస్తాయి? మూఢం మొదలైంది శుభకార్యాలు నిర్వహించవద్దు అంటారెందుకు? ఈ సమయంలో ఏ కార్యాలు చేయొచ్చు - ఏం చేయకూడదు?

Moodami 2025: ఓ వైపు గురు మౌఢ్యమి..ఆ తర్వాత ఆషాఢ మాసం ప్రారంభం. నెలన్నర పాటూ శుభకార్యాలకు ఫుల్ స్టాప్ పడినట్టే. మళ్లీ శ్రావణమాసం మొదలైన తర్వాత శుభకార్యాలు ప్రారంభమవుతాయి. అసలు మౌఢ్యమి అంటే ఏంటి? ఈ సమయంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఏమవుతుంది
గురు మౌఢ్యమి ప్రారంభం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠమాసం పౌర్ణమి జూన్ 10 మంగళవారం ఉదయం 10 గంటల 47 నిముషాల నుంచి జూన్ 11 బుధవారం మధ్యాహ్నం 12 గంటల 21 నిముషాల వరకు.
జూన్ 11 బుధవారం జ్యేష్ఠ పౌర్ణమి...ఈ రోజు నుంచి గురు మౌఢ్యమి ప్రారంభమవుతుంది
జూలై 12 ఆషాఢమాస బహుళ విదియ శనివారంతో గురు మౌఢ్యమి ముగుస్తుంది
మౌఢ్యమి రోజుల్లో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదు?
నవగ్రహాలకు రాజు సూర్యభగవానుడు. ఆదిత్యుడికి సమీపంలోకి ఏ గ్రహం వచ్చిన తన శక్తిని కోల్పోతుంది. అలా గురుగ్రహం ఆదిత్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహం దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యమి ఏర్పడుతుంది. ఈ సమయంలో గురుడు, శుక్రుడి శక్తి క్షీణిస్తుంది.
ఏ శుభకార్యం నిర్వహించాలన్నా గురుబలం, శుక్రగ్రహం చాలా ప్రధానం. ఈ రెండు గ్రహాలు శక్తిని కోల్పోయినప్పుడు శుభకార్యాలు నిర్వహిస్తే గురు బలం ఉండవు. గురుబలం లేకుండా నిర్వహించిన ఏ శుభకార్యమూ శుభాన్నివ్వదు. అందుకే ఈ సమయంలో ఏం చేసినా కలసి రాదని పండితులు చెబుతారు. మూఢంలో శుభకార్యాలు చేయకూడదని చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఇదే.
అయితే అన్ని కార్యాలు ఆపేయాల్సిన అవసరం లేదు.. కొన్ని తప్పనిసరిగా ఆపేయాలి, కొన్ని నిర్వహించుకోవచ్చు..అవేంటంటే
శుభగ్రహాలైన గురు, శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మౌఢ్యమి రోజుల్లో వివాహం చేయకూడదు. లగ్న పత్రిక కూడా రాసుకోకూడదు, అసలు పెళ్లికి సంబంధించిన మాటలు కూడా కూడదు
గృహప్రవేశం, శంకుస్థాపన లాంటివి చేయకూడదు..ఇల్లు కూడా మారరాదు
చిన్నారులకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు
మౌఢ్యమి సమయంలో అన్న ప్రాసన చేసుకోవచ్చు
గృహంలో రిపేర్ వర్కులు చేయించుకోవచ్చు
భూములు కొనుగోలు చేయొచ్చు, అమ్మొచ్చు, అగ్రిమెంట్లు చేసుకోవచ్చు
కొత్త ఉద్యోగాల్లో చేరొచ్చు, ఉద్యోగం మారొచ్చు, ఉద్యోగం కోసం దూర ప్రాంత ప్రయాణాలు చేయొచ్చు
కొత్త వాహనాలు, నూతన వస్త్రాలు కొనుగోలు చేయొచ్చు
ఇవేం పట్టింపులేదని శుభకార్యం నిర్వహిస్తే ఏమవుతుంది?
మౌఢ్యమి సమయంలో ఏ శుభకార్యం తలపెట్టినా దానివల్ల అశుభమే జరుగుతుందని చెబుతారు. అనుకోని కష్టం, ఊహించని నష్టం ఉంటుందని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు.
గమనిక: పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
షేర్ మార్కెట్ ఏ నెలలో పెరుగుతుంది , ఏ నెలలో డౌన్ అవుతుంది - ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















