అన్వేషించండి

Durga Amma Seva: తిరుమల మాదిరిగా దుర్గమ్మ సన్నిధిలో భక్తుల కోసం సరికొత్త సేవలు- ఇకపై సేవకుల ద్వారానే అన్ని సేవలు!

Amma Seva: కలియుగప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరుడికి సేవ చేసేందుకు భక్త జనం బృందాలుగా తిరుమలకు తరలివెళతారు. ఇప్పుడే అదే అవకాశం కనకదుర్గమ్మ భక్తులకు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Durga Amma Seva:  శ్రీవారి సేవ మాదిరిగా దుర్గమ్మ సేవ చేసుకునే అవకాశం భక్తులకు కల్పించనున్నారు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం అధికారులు.ఇందుకు  సంబంధించి కొత్తగా సేవావిభాగం ఏర్పాటు చేయనున్నారు. అన్ని విభాగాల్లానే ఈ సేవా విభాగం కూడా శాశ్వతంగా పనిచేస్తుంది. దీనికి కూడా ఓ EO, సూపరింటెండెంట్, ఓ గుమస్తా ఉంటారు. ఇప్పటివరకూ సేవకు సంబంధించి ఎలాంటి విభాగం లేదు..  సేవకుల పేర్లను రిజిస్టర్‌ చేసుకునే పనిని విధుల్లో ఉండే ఇతర సిబ్బందికి అప్పగించేవారు. ఇకపై సేవకుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.

దుర్గమ్మ సేవకు వచ్చేవారికి వన్‌టౌన్‌లో ఉన్న సీవీరెడ్డి సత్రంలో బస, ఆలయంలో భోజనం ఏర్పాటు చేస్తారు. దేవస్థాన వాహనాల్లో వారిని తీసుకెళ్లి సేవ చేయాల్సిన ప్రదేశాల్లో విడిచిపెడతారు. మళ్లీ బస చేసే కేంద్రం వద్దకు కూడా దేవస్థాన వాహనాలే దింపుతాయి. సేవ పూర్తైన తర్వాత అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదం , ఆశీర్వచనం ఇప్పించి పంపిస్తారు.  
 
దుర్గమ్మ సన్నిధి మాత్రమే కాదు దానికి అనుబందంగా ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ సేవకుల సేవలు వినియోగించుకోనున్నారు. రోజుకి 200 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీనివాసుడి సేవ చేయాలి అనుకునే భక్తులు ఆన్ లైన్లో బుక్ చేసుకోవాలి. ఖాళీగా ఉన్న తేదీలను చూసి బుక్ చేసుకుంటే..అక్కడకు వెళ్లిన తర్వాత శ్రీవారి సేవావిభాగం పనులు కేటాయిస్తుంది. ఇప్పుడు ఇదే పద్ధతి ఇంద్రకీలాద్రిపైనా అవలంభించనున్నారు. అమ్మవారి సేవ చేయాలి అనుకున్న వారు దేవస్థాన అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

ప్రస్తుతం సేవకులను అన్నదాన విభాగం, క్యూలైన్ల వద్ద మాత్రమే వినియోగిస్తున్నారు. కానీ ఇకపై సేవకులను ఆలయానికి సంబంధించిన అన్ని కేంద్రాల్లోనూ సహకరించేలా ప్రమాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతరాలయం ముందు, లోపల ప్రస్తుతం మహిళా సెక్యూరిటీగార్డులు ఉంటున్నారు. రద్దీ ఉన్నప్పుడు తప్పదు కానీ రద్దీ లేనప్పుడు కూడా సరిగా దర్శనం చేసుకోనివ్వడం లేదనే ఆరోపణలున్నాయి. అందుకే ఆ ప్రదేశంలో సేవకులను పెట్టాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

అంతరాలయంతో పాటూ ముఖద్వార దర్శనం, ఉచిత క్యూలైన్లు, 100 రూపాయల క్యూలైన్ల వద్ద కూడా సెక్యూరిటీ గార్డులను తొలగించి ఆ స్థానంలో సేవకులను నియమించనున్నారు. ఇంకా అన్నదానం, క్యూలైన్ల ప్రవేశ మార్గం, ప్రసాదం కౌంటర్లు, సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ పాయింట్లు, లగేజీలు భద్రపరిచే కౌంటర్‌, చెప్పుల స్టాండ్‌ వద్ద కూడా సేవకులను నియమిస్తారు. పార్కింగ్ దగ్గర సెక్యూరిటీ గార్డులుగా కూడా సేవకులే ఉండబోతున్నారు. ఆర్జిత సేవల వద్ద కూడా సేవకులే సేవలే వినియోగించుకోనున్నారు.
 
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను కొండపైకి తీసుకెళ్లేందుకు  రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎస్‌, దుర్గాఘాట్‌ నుంచి బస్సులు నడుపుతున్నారు. ఈ ప్రదేశాల్లో బస్ ఎక్కేటప్పుడు భక్తులు రద్దీ ఎక్కువై తోపులాటలు జరుగుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు గాయపడిన సందర్భాలున్నాయి. అందుకే ఈ ప్రదేశాల్లో సేవకులను నియమిస్తే క్యూలైన్లలో ప్రయాణికులు బస్ ఎక్కే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.  

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget