అన్వేషించండి

 Weekly Horoscope 8 To 14 June 2025: వృత్తి, ఉద్యోగం, వివాహం , ఆరోగ్యంపై ఈ వారం గ్రహాల ప్రభావం - జూన్ 8 to జూన్ 14 వారఫలాలు!

Weekly Horoscope: జూన్ 08 ఆదివారం నుంచి జూన్ 14 శనివారం వరకూ తులా నుంచి మీనం మీ వారఫలాలు ఇక్కడ తెలుసుకోండి...

 Weekly Horoscope 8 To 14 June 2025

తులా రాశి (Libra  Weekly Horoscope) 

తులా రాశివారు ఈవారం ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. సమస్యలను తొలగించడంలో కార్యాలయంలోని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. మీడియాతో సంబంధం ఉన్నవారి ఆదాయం పెరుగుతుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. మీ పనితీరుకి ప్రశంసలు అందుతాయి.  మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. సంక్లిష్టమైన కేసులను పరిష్కరించవచ్చు.  బంధువులతో సంబంధాలు క్షీణించవచ్చు.  ప్రేమ సంబంధాలలో దూరం పెరుగుతుంది.  చిట్ ఫండ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొద్దు. ఆస్తి పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చిక రాశి (Scorpio   Weekly Horoscope) 

ఈ వారం మీకు మంచి జరుగుతుంది. అతిథులు ఇంటికి వస్తారు. సేవా రంగానికి సంబంధించిన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.  పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. శత్రువులతో రాజీ పడతారు. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత లభిస్తుంది.  చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.  ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. వ్యాపారాన్ని ప్రారంభించడానికి అప్పు తీసుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. బడ్జెట్ ను జాగ్రత్తగా చూసుకుని ఖర్చు చేయండి.వారం మధ్యలో చికాకులుంటాయి. యోగా, వ్యాయామానికి తగిన సమయం కేటాయించండి.

ధనుస్సు రాశి  (Sagittarius Weekly Horoscope) 

ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. బోధనతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రమోషన్ పొందవచ్చు. అన్ని పనులు శాంతియుతంగా పూర్తవుతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి ప్లాన్ చేసుకుంటారు. గృహస్థులు తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. కెరీర్‌లో ఏదైనా ప్రత్యేక విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం బావుంటుంది. ఈ వారం శుభప్రదంగా ఉంటుంది కానీ  పాత ప్రతికూల జ్ఞాపకాలతో మనస్సు బాధపడుతుంది. ఆరోగ్యం పరంగా సమయం మంచిది కాని నిర్లక్ష్యంగా ఉండకండి. ఫలించని పనులలో డబ్బును వృథా చేయవద్దు.  

మకర రాశి (Capricorn Weekly  Horoscope)

మీ వారం మీకు మంచి ప్రారంభమవుతుంది. సానుకూల ఆలోచనతో ఉంటారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడంలో బిజీగా ఉంటారు. ఈ వారం పొదుపుపై శ్రద్ధ చూపిస్తారు. ఈ వారం ఈ రాశి వైద్యులు , న్యాయవాదులకు ప్రత్యేకంగా ఉంటుంది. ప్లాన్ చేసుకున్న పనులు సమయానికి పూర్తిచేయండి.  నిర్దిష్ట వ్యక్తిని కలిసే అవకాశులున్నాయి. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. మైగ్రేన్ వ్యాధి ఉన్నవారికి ఇబ్బంది పెరుగుతుంది. తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉండండి 

కుంభ రాశి  (Aquarius  Weekly Horoscope) 

ఈ వారం మీ ఇంట్లో ఆనందకరవాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. మీ బాధ్యతలను బాగా నిర్వర్తించగలరు. అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. భౌతిక సౌకర్యాలకు ఆకర్షితులవుతారు. ఉద్యోగంలో మీ పనితీరు ప్రశంసనీయం అవుతుంది. విదేశీ క్లయింట్‌తో వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. మాదకద్రవ్యాల వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. అపరిచితుల మాటలను నమ్మవద్దు. మీ కుటుంబానికి సమయం ఇవ్వండి.  మీ వైఖరిని పిల్లల పట్ల బాగా ఉంచండి. వ్యర్థమైన కార్యకలాపాలలో విద్యార్థులు తమ సమయాన్ని వృథా చేయకూడదు. ప్రేమ వ్యవహారాలు కలసిరావు.
 
మీన రాశి (Pisces  Weekly Horoscope) 

ఈ వారం మీన రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు ఓ నిర్దిష్ట పనికోసం గొప్ప అవకాశం పొందుతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు. కాంట్రాక్టర్లు, నిర్మాణ రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో  కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మీ లోపాలను గుర్తించి సరిచేసుకునేందుకు ప్రయత్నించండి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

షేర్ మార్కెట్ ఏ నెలలో పెరుగుతుంది , ఏ నెలలో డౌన్ అవుతుంది - ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?

వీడియోలు

Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
CM Revanth Reddy: గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రేసింగ్ లీగ్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్
గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రేసింగ్ లీగ్.. హాజరైన రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్
Discount On Cars: టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం
టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Embed widget