Vastu Tips for Home : లక్ష్మీదేవి కరుణ కోసం మాయాజాలం అవసరం లేదు ఈ చిన్న వాస్తు చిట్కాలు పాటిస్తే చాలు!
Vastu Tips In Telugu: మీ జీవితంలో డబ్బుని , ఆనందాన్ని ఆకర్షించడానికి మీకు ఎలాంటి మాయాజాలం అవసరం లేదు. పరిశుభ్రంగా ఉండే ఇల్లు, కొన్ని చిన్న చిన్న వాస్తు చిట్కాలు చాలు..

Vastu Tips for Home: వాస్తు ప్రకారం అంతా బావున్నట్టే ఉంటుంది, వాస్తు పండితులు వచ్చి చూసిన తర్వాత కూడా ఎలాంటి లోపం ఉండదు. కానీ ఇంట్లో చికాకులు తగ్గవు, డబ్బులు చేతిలో నిలువవు. అందుకు కారణం చిన్న చిన్న విషయాలే అంటారు వాస్తు నిపుణులు. వాస్తవానికి వాస్తుపై నమ్మకం లేనివారు కూడా ఇవి పాటిస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది.
చెత్తను తొలగించండి
గజిబిజిగా ఉన్న ఇల్లు ప్రవహించని నదిలా కనిపిస్తుంది. ఇలాంటి వాతావరణంలో అదృష్టం ఉండమన్నా ఉండదు. అందుకే మీరు ఇంటిని శుభ్రం చేయాలి. దుమ్ము, ధూళి తొలగించడంతో పాటూ విరిగిన బొమ్మలు, పాత పుస్తకాలు, ఖాళీ పెట్టెలు పారవేయండి. ఈశాన్య మూలన శుభ్రంగా ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రత్యేకమైన ఆలోచనలు విజయం దిశగా మిమ్మల్ని నడిపిస్తాయి.
వెలుగు ప్రసరింపచేయండి
ఇంటిలో చీకటికి అవకాశం ఇవ్వొద్దు. ఎందుకంటే వెలుగు అదృష్టాన్ని మోసుకొస్తుంది. చీకటి మీ జీవితంలో మంచి విషయాలను దాచిపెడుతుంది. వెలుగు వాటిని బయటకు తెస్తుంది. కాబట్టి మీ ఇల్లు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా, శుభ్రంగా వెలుగు నిండేలా చూసుకోండి. సూర్యరశ్మి లోపలికి వచ్చేలా ఉదయం కిటికీలు తెరిచి ఉంచండి. విరిగిన బల్బులను సరిచేయడానికి ప్రయత్నించండి. దక్షిణ దిశను చీకటిగా ఉంచొద్దు. మీ మంచం ఎదురుగా అద్దం ఎప్పుడూ ఉంచవద్దు ఎందుకంటే అది మీ నిద్రకు భంగం కలిగించవచ్చు.
ఉత్తర దిశ ప్రత్యేకం
డబ్బు, కెరీర్ కి సంబంధించి ఈ ఇంట్లో ఉత్తర దిశలో మార్పులు చేర్పులు చేయండి. ఈ దిశకు వరుణుడు అధిపతి. అందుకే ఈ దిక్కున నీటి ఫౌంటైన్ ఏర్పాటు చేయాలి. లేదంటే జలపాతం చిత్రాన్ని పెట్టండి. ఈ దిశను ఎప్పుడూ శుభ్రంగా ఉంచితే వృత్తి, వ్యక్తిగత జీవితంలో వృద్ధి ఉంటుంది.
ఆగ్నేయంలో వెలుగులు
ఆగ్నేయాన్ని ప్రకాశింపజేయడం ద్వారా భారీ సంపదను పొందవచ్చు. ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్‌ను ఉంచితే మంచి జరుగుతుంది. ఈ దిశలో ఎరుపు రంగు వస్తువులు ఉంచకూడదు.
ఈశాన్యంలో ఖాళీ ఉంచండి
సంపద కేవలం డబ్బు మాత్రమే కాదు, శాంతి కూడా. సంతోషకరమైన హృదయం మీ జీవితంలో అతిపెద్ద నిధి. ఈశాన్యం శాంతి, అభ్యాసం , జ్ఞానానికి నిలయం. ఈశ్వరుడి దిక్కు అయినా ఈశాన్యంని శుభ్రంగా ఉంచండి. ఈ దిశగా బుద్ధ విగ్రహాన్ని లేదా ప్రశాంతమైన పెయింటింగ్‌ను కూడా ఉంచవచ్చు. ధ్యానం చేసేందుకు ఈ దిశ అత్యుత్తమం. ఫర్నిచర్ లాంటి బరువైన వస్తువులు ఈ దిశలో పెట్టొద్దు.
ప్రధాన ద్వారం ముందు ముగ్గులతో అలంకరించండి. ద్వారాన్ని అందంగా తీర్చి దిద్దండి. మంచి శక్తి ప్రవేశించే చోట దానిని పరిశుభ్రంగా ఉంచాలి. నైరుతి దిశలో కుటుంబ ఫొటో పెట్టండి. ఇంటి మధ్యలో బ్రహ్మస్థానంలో బరువైన వస్తువులు ఉంచొద్దు. ఇంటి తూర్పు దిశలో విండ్ చైన్ లేదా మొక్కలు ఉంచండి.
గమనిక: వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
షేర్ మార్కెట్ ఏ నెలలో పెరుగుతుంది , ఏ నెలలో డౌన్ అవుతుంది - ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















