Horoscope Today January 1st 2022: జనవరి 1న ఈ రాశుల వారికి భలేమంచి రోజు, ఇందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2022 జనవరి 1 రాశిఫలాలు
మేషం
కొత్త సంవత్సరం మొదటి రోజు మీరెంత కష్టపడినా సరైన ఫలితాలు రావు. కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు అయినప్పటికీ పనిపై దృష్టి సారించండి. కొత్తగా ఏదో చేద్దాం అనిమాత్రం ట్రై చేయకండి. మీరు మీ జీవిత భాగస్వామి గురించి ఓ విషయంలో ఆందోళన చెందుతారు.
వృషభం
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు కొత్త సంవత్సరంలో మొదటి రోజు అంతా శుభమే జరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగానికి సంబంధించిన పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అవివాహితులకు సంబంధాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. విద్యార్థులుకు చదువుపట్ల ఏకాగ్రత పెరుగుతుంది.
మిథునం
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త సంవత్సరం మొదటి రోజున కార్యాలయంలో ఉద్యోగులతో సరదా సంభాషణలు జరుగుతాయి. ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. ప్రతికూల ఆలోచనలు విడిచిపెట్టండి.
Also Read: కొత్త ఏడాది ఆరంభంలో ఈ రాశి వారు ఏపని తలపెట్టినా పూర్తైపోతుంది...2022 జనవరి నెల రాశి ఫలాలు
కర్కాటకం
మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగుల సహకారంతో పని పూర్తిచేస్తారు. మీ సామర్థ్యానికి మించి ఎవరికీ సహాయం చేయకండి.
సింహం
ఈరోజు ఎంత కష్టపడి పని చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఏడాదిలో మొదటి రోజు ప్రతికూల ఆలోచనలు విడిచిపెట్టండి. మీకు అత్యంత ప్రియమైనవారికి బహుమతులు ఇవ్వండి. అనుభవజ్ఞుల మద్దతు లభిస్తుంది. సీనియర్ అధికారులు నుంచి ప్రశంసలు అందుకుంటారు.
కన్య
ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. పెద్దలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అపరిచితులపట్ల జాగ్రత్త వహించండి.
Also Read: 2022 లో ఈ రాశుల వారు ఈ పనులు చేయకండి..
తుల
భాగస్వామ్యానికి సంబంధించి చేసే పనిలో మంచి విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. ఇంట్లోనే పార్టీ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంటా-బయటా గౌరవం అందుకుంటారు.
వృశ్చికం
ఈ రోజు మీ మనస్సు ఆధ్యాత్మికతవైపు మొగ్గుచూపుతుంది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఒక పెద్ద కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీరు వ్యాపార సంబంధాల నుంచి మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఆదాయ వనరులు చాలా బాగుంటాయి.
ధనుస్సు
మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి. మీ పనిపై మీకు నమ్మకం లేకపోవడం వల్ల అవమానానికి గురవుతారు.. అందుకే మీ ఆలోచనలను అందరితో పంచుకోండి. స్త్రీలు ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. అప్పులు ఇవ్వొద్దు. ఆన్ లైన్ వ్యాపారాల్లో నష్టపోతారు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
మకరం
ఓ కొత్త బాధ్యతను భుజానికెత్తుకుంటారు. కళలు, సంగీతంపై ఆసక్తి ప్రదర్శిస్తారు. అన్ని పనులను పూర్తిచేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు.
కుంభం
కుటుంబంలో శాంతి ఉంటుంది. సృజనాత్మకంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఉద్యోగస్తులు అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలు చూసుకుంటారు. వ్యాపారంలో ఖర్చులు పెరుగుతాయి.
మీనం
ఈరోజు మీకు భలేమంచి రోజు. మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఈ రోజు ఏం చేసినా అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. నిదానంగా సాగుతున్న నిర్మాణ పనులు ఊపందుకుంటాయి.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి