Horoscope Today 31 October 2021: ఈ రాశుల వారికి ఈరోడు డబ్బు చేతికందుతుంది... ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
మేషరాశివారు ప్రమాదకర పనులకు దూరంగా ఉండండి. ఈ రోజు ఖర్చులెక్కువ ఉంటాయి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఇబ్బంది పెడతాయి. విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
వృషభం
కార్యాలయంలో శుభవార్తలు వింటారు. పూజల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మతపరమైన ప్రయాణాలకు ప్రణాళిక ఉంటుంది. లాభాల వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. టెన్షన్ పెరుగుతుంది.
మిథునం
కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. బకాయిలు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
కర్కాటకం
ఏదైనా వివాదం కారణంగా మీరు కలత చెందవచ్చు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపార భాగస్వాములతో సఖ్యత ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. ఇంటా బయటా ఎవ్వరి నుంచీ సహకారం ఉండదు. తలపెట్టిన పనులు ఆలస్యమవుతాయి. ఆదాయం తగ్గుతుంది. అనుకోని ఖర్చులుంటాయి. మీరు రుణం తీసుకోవలసి రావచ్చు.
సింహం
వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఊహించని లాభాలు ఉండొచ్చు. బెట్టింగ్ , లాటరీలకు దూరంగా ఉండండి. వ్యాపార ప్రయాణం విజయవంతమవుతుంది. ఒక పెద్ద సమస్య నుంచి బయటపడొచ్చు. ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. రహస్య చర్చలను జాగ్రత్తగా నిర్వహించండి.
కన్య
రిస్క్ తీసుకుంటేనే కొన్ని పనులు పూర్తవుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూల సమయం. స్నేహితుల మద్దతు పొందుతారు. వ్యాపారం బాగానే ఉంటుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబం కొంత ప్రతికూలత ఉంటుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
తుల
శత్రువులు ప్రశాంతంగా ఉంటారు. వివాదాస్పద పరిస్థితులకు దూరంగా ఉండండి. అప్పిచ్చిన మొత్తం చేతికందుతుంది. యువకుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరగొచ్చు. వ్యాపారం బాగానే ఉంటుంది. అనవసరమైన ఖర్చు ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. తొందరపాటు వద్దు.
వృశ్చికం
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. స్నేహితుడి ప్రవర్తన వల్ల టెన్షన్ ఉంటుంది. మీ మాటలపై సంయమనం పాటించండి. ఎవరి ప్రవర్తన అయినా ఇబ్బంది కలిగిస్తుంది. పాత వ్యాధి తిరిగబెట్టొచ్చు. దుర్వార్త వినే అవకాశం ఉంది. రిస్క్ తీసుకోవద్దు. పోటీ పెరుగుతుంది. కుటుంబ ఆందోళనలు పెరుగుతాయి. రాజకీయ అడ్డంకులు తొలగిపోతాయి.
ధనుస్సు
విద్యార్థులు విజయం సాధిస్తారు. చదువుపై ఆసక్తి ఉంటుంది. దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించండి. మీరు పెద్దల నుంచి సలహాలు తీసుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
Also Read: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
మకరం
ఈరోజంతా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. టెన్షన్ తగ్గుతుంది. సోమరితనం వీడండి. ఒళ్లు నొప్పులు బాధిస్తాయి. అనారోగ్య సూచనలున్నాయి.
కుంభం
ఆఫీసులో ఉన్నతాధికారులను కలుస్తారు. తలపెట్టిన పని సఫలమవుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. భాగస్వాముల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపదలో పెరుగుదల ఉండొచ్చు. వ్యాపారస్తులకు శుభసమయం. వివాదాల్లో తలదూర్చవద్దు.
మీనం
భౌతిక వనరులను సమీకరించడంలో ఖర్చు ఉంటుంది. తొందరపాటు వద్దు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. మీరు చేపట్టే పనిలో జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారం బాగానే ఉంటుంది. తొందరగా అలసిపోతారు.
Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!
Also Read:అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి