Horoscope Today 27 November 2021: ఈ రాశివారికి సలహాలు ఇవ్వాలనే సరదా ఎక్కువ, ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
ఈరోజు కుటుంబానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. టెన్షన్ ఉండొచ్చు. మీ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించండి. ఓర్పుగా ఉండండి. ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శత్రువులు ఈరోజు చురుకుగా ఉంటారు. ఆరోగ్యం విషయంతో నిర్లక్ష్యం వద్దు.
వృషభం
మీకు అద్భుతంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. మనసులో కొత్త ఉత్సాహం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఏ పనిని వాయిదా వేయకండి. రిస్క్ తీసుకోవద్దు. వ్యాపారం బాగానే ఉంటుంది. మిత్రులను కలుస్తారు. బయట తినడం మానుకోండి. కార్యాలయంలో శుభవార్త వింటారు.
మిథునం
స్నేహితుడి మాటల వల్ల ఒత్తిడికి లోనవుతారు. యాత్రకు వెళ్ళొచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. ఆఫీస్‌లో పని చేయాలని కూడా మీకు అనిపించదు. ఇప్పట్లో ప్రమోషన్ వచ్చే అవకాశం లేదు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. మీరు శారీరక నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు.
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
కర్కాటకం
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. స్నేహితుడిని కలుస్తారు. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఆర్థికంగా నష్టపోవచ్చు. ఆర్థిక పెట్టుబడులు పెట్టేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా చదవండి. ఎవరి మాటల్లో తలదూర్చవద్దు. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. శత్రువులు చురుకుగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం
మీరు శుభవార్త వింటారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సహాయంతో చాలా మంది వ్యక్తుల పనులు పూర్తవుతాయి. మహిళలు ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. అనవసర మాటలు కట్టిపెట్టండి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణం చేయవద్దు, గాయాలయ్యే ప్రమాదం ఉంది.
కన్య
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. పనుల్లో వస్తున్న ఆటంకాలు తొలగిపోతాయి. మీరు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. కొన్ని పనులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండవచ్చు. కానీ అన్ని అడ్డంకులు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. కార్యాలయంలో ప్రత్యర్థులు హాని కలిగిస్తారు. యువతకు కొత్త సమాచారం అందుతుంది. పనిని వాయిదా వేయవద్దు.
Also Read: భక్తి తొమ్మిది రకాలు.. ఇందులో మీరు అనుసరిస్తున్న విధానం ఏంటి..
తుల
దినచర్యలో మార్పులొస్తాయి. స్నేహితుడితో కలిసి నడకకు వెళ్ళవచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీరు శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించగలుగుతారు. చాలా మందిని కలుస్తారు. ఓపిక పట్టండి, ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. భగవంతుని ఆరాధనలో మనోధైర్యం పొందుతారు. శత్రువు వైపు జాగ్రత్త వహించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం
ఈరోజు కార్యాలయంలో కొత్త బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ రోజంతా సమస్యలతో నిండి ఉంటుంది. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అనుకున్న పనులన్నీ అసంపూర్తిగా నిలిచిపోతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. బంధువును కలుస్తారు. యువత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. వివాదాల్లో తలదూర్చవద్దు.
ధనుస్సు
జీవిత భాగస్వామితో మాధుర్యం ఉంటుంది. మీరు మతపరమైన ప్రయాణం చేయవచ్చు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఈరోజు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీరు అప్పుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఏదైనా పని విషయంలో పెద్దలను సంప్రదించండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
మకరం
ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకర పనిని నివారించండి. పెట్టుబడి బాగానే ఉంటుంది. ఆఫీసులో ఎవరితోనైనా విభేదాలు రావచ్చు. టెన్షన్ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ఏ పనిని అసంపూర్తిగా ఉంచవద్దు. చట్టపరమైన విషయాలు పెండింగ్‌లో ఉంటాయి. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి.
కుంభం
ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. టెన్షన్ పెరుగుతుంది. మీ ఆహారాన్ని నియంత్రించండి. కుటుంబ సమస్యలు దూరమవుతాయి. గందరగోళంగా ఉంటుంది. స్నేహితులు సహాయం చేస్తారు. పెట్టుబడి పెట్టొచ్చు. రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మీనం
మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సంతోషంగా ఉంటారు ఏదైనా మతపరమైన పనులకు సంబంధించి బంధువులతో చర్చలు జరుపుతారు. ఈ రోజు మీరు భగవంతుడిని ఆరాధించడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: దొంగలే పాలకులు.. పాలకులే దొంగలు...కలికాలం అంటే ఇదే
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: 1008 రకాల కూరగాయలు ఉన్నాయా... ఇప్పటి వరకూ తిన్నారా ఎవరైనా...!
Also Read: సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి