(Source: ECI/ABP News/ABP Majha)
Christmas Special: కిస్మస్ రోజు 'ట్రీ' ని ఎందుకు అలంకరిస్తారు.. చెట్టుకి -వేడుకకు సంబంధం ఏంటి..
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీస్ కళ్లు మిరిమిట్లు గొలిపేలా కాంతులు వెదజల్లుతున్నాయి. ఇంతకీ ఈ క్రిస్మస్ పండుగకు ట్రీకి ఉన్న సంబంధం ఏంటి...
డిసెంబర్ 25 క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చిలన్నీ ప్రార్థనలతో మారుమోగిపోతాయి. క్రైస్తవుల ఇళ్లన్నీ విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతుంటాయి. క్రిస్మస్ వేడుకకు కొద్ది రోజులే ఉండడంతో అప్పుడే సందడి మొదలైంది. ఎవరి స్థోమతకు తగ్గటుగా వారు జరుపుకునే ఈ వేడుకల్లో భాగంగా చర్చిలు, ఇళ్లను విద్యుత్ దీపకాంతులతో అలంకరించడం, ప్రార్థనలు చేయడం, కొత్తబట్టలు ధరించడం, శాంటాక్లాజ్, క్రిస్మస్ ట్రీ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటిలో క్రిస్మస్ సందడి మొదలైంది అనిపించేది మాత్రం క్రిస్మస్ ట్రీ అలంకరణతోనే.
Also Read: క్రిస్మస్ ని డిఫరెంట్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..
క్రిస్మస్ రోజు చెట్టుని ఎందుకు అలంకరిస్తాం అనే విషయంపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.
క్రీస్మస్ రోజు అంతా చర్చికి వెళ్లడం, రకరకాల బహుమతులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. చాలా ఏళ్ల క్రితం ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పిల్లాడి వద్ద డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తోచక తన ఇంటిముందు అందమైన మొక్కను తీసి చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకెళతాడు. అక్కడున్నవారంతా విలువైన కానుకలతో వస్తారు. వారంతా ప్లాబో తెచ్చిన పూలకుండీ చూసి ఎగతాళి చేస్తారు. దీంతో ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ వద్ద పెడతాడు. ఆ మొక్క అప్పటికప్పుడు పెద్ద బంగారు వృక్షంలా మారిపోతుంది. దీంతో ఆ పేద బాలుడి తెచ్చిన కానుకే అందరి కంటే విలువైనది అవుతుంది. అప్పటి వరకు బాలుడిని ఎగతాళి చేసిన వారంతా తలదించుకుంటారు. అప్పటి నుంచి ఏటా క్రిస్మస్ వేడుకల్లో ట్రీ భాగమైపోయిందని చెబుతారు.
Also Read: గుడ్ల గూబను అశుభం అనుకుంటే పొరపాటే.. ఈ విషయం తెలుసా..
ఇంకా చాలా మంది క్రైస్తవులు క్రిస్మస్ ట్రీపై స్టార్స్ పెట్టడం.. విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేస్తుండం కన్పిస్తూ ఉంటుంది. మంచి మనస్సుతో ఏ చిన్న కానుక క్రీస్తుకి ఇచ్చినా అది ఆయనకు అత్యంత విలువైనది అనే పరమార్థాన్ని చాటిచెప్పడమే క్రిస్మస్ ట్రీ ప్రత్యేకత .
Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి.
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చేరిన కోల్ కతా దుర్గామాత వేడుకలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి