News
News
వీడియోలు ఆటలు
X

Christmas: క్రిస్మస్ ని డిఫరెంట్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

సర్వమత సమ్మేళనం అయిన మనదేశంలో కొన్ని పండుగలు అంతా కలిసే జరుపుకుంటారు. మరికొన్ని రోజుల్లో వచ్చే క్రిస్మస్ ని విభిన్నంగా ప్లాన్ చేసుకోవాలనుకునే ఆలోచన ఉన్నవారు ఇలా చేయండి..

FOLLOW US: 
Share:

 హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతానికి చెందిన దేవుడైనా చెప్పేదొకటే. మంచి ఆలోచించు, నలుగురికి సాయం చేయు, మనసులోకి చెడు ఆలోచనలు రానివ్వొద్దని.  ఎన్ని మత గ్రంధాలు చదివినా వాటి భావం మాత్రం ఇదే. ముఖ్యంగా స్నేహానికి మతానికి అస్సలు సంబంధం ఉండదు. మన స్నేహితుల్లో అన్ని మతాల వారు ఉంటారు. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఇలా ముఖ్యమైన పండుగల సమయంలో చాలామంది కలపి జరుపుకునే సందర్భాలున్నాయి. ఇంతకీ ఇప్పుడు చెబుతున్నదేంటంటే... క్రిస్మస్ ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సన్నిహితులతో డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవాలని అనుకునే వారికి  మేం కొన్ని టిప్స్ చెబుతున్నాం. 

1. శాంటాగా మారిపోండి.
క్రిస్మస్ అనేది కానుకల పండుగ. శాంటా అందరికీ బహుమతులు అందిస్తారని అంటారు. ఈ పండగ సందర్భంగా తమకు వచ్చే బహుమతుల కోసం వేచిచూస్తుంటారంతా.  అందుకే మీరే శాంటా క్లాజ్‌గా మారిపోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకే కాదు.. రాత్రిళ్లు మురికి వాడలకు వెళ్లి అక్కడి పిల్లలకు కూడా బహుమతులను అందించండి. దీనివల్ల మీరు పొందే ఆనందం అనిర్వచనీయం. 

2. అనాథాశ్రమాలకు వెళ్లండి
మనం శాంటాగా మారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బహుమతులు అందిస్తుంటాం. అయితే ఇలాంటి బహుమతులు అవసరం అయ్యే అభాగ్యులు ఎందరో ఉన్నారు. అందుకే ఈ ఏడాది కాస్త కొత్తగా కుటుంబ సభ్యులతో పాటూ అనాథాశ్రమాల్లో ఉండే పిల్లలకు విభిన్న బహుమతులు ఇచ్చేందుకు ట్రై చేయండి. వారు అడిగింది కొనిచ్చే అమ్మానాన్నలు లేరుకాబట్టి శాంటా రూపంలో అమ్మానాన్నగా మారి వారిని ఆనందపరిస్తే అంతకుమించిన పండుగ మరేముంటుంది. 

Also Read:  చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..

3. కేక్, కుకీస్, వంటకాలు చేసుకోండి.
క్రిస్మస్‌ అంటేనే కేకుల సంబరం. నెల రోజుల ముందునుంచీ కేకుల తయారీలో బిజీగా ఉంటారు.  రమ్ కేక్, కుకీస్, పేస్ట్రీలు, హాట్ చాక్లెట్స్ తయారుచేస్తుంటారు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు,  మీ స్నేహితులు ఇష్టమైన వంటకాలు సిద్ధం చేయండి. ఎప్పుడూ చేసేవి కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయండి. 

4.‘క్రిస్మస్ ట్రీ’ని అలంకరించండి.
క్రిస్మస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ. దీని అలంకారం ఓ ఆర్ట్. మీ క్రియేటివిటీ మొత్తం ఉపయోగించి అందరి కన్నా భిన్నంగా క్రిస్మస్ ట్రీ అలంకరించండి. దానికింద కొన్ని బహుమతులు పెట్టి ఇంట్లో పిల్లలు ఉంటే వారికి, లేదంటే చుట్టుపక్కల కొందరు పిల్లలకు పంచండి.  మీ క్రియేటివిటీ పెరగడమే కాదు చూసినవారూ ఆనందపడతారు. 

5. ఇంటిని డెకరేట్ చేయండి.
ఏ పండుగకైనా ఇంటిని శుభ్రం చేసి అందంగా అలంకరిస్తుంటాం. కేవసం క్రిస్టియన్స్ మాత్రమే కాదు ఇంటిని అందంగా అలంకరించడం అందరూ చేయొచ్చు. సో మీకు కాస్త విభిన్నంగా అలంకరించేందుకు ప్లాన్ చేసుకోండి.  చిన్న చిన్న స్టార్స్, గిఫ్ట్ బాక్సులు, పేపర్ ఫ్లవర్స్.. వీటితో పాటు క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయగా మిగిలిన వస్తువులతో కూడా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. 

Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట

6. స్నేహితులతో పార్టీ 
స్నేహితులతో పార్టీ అనేది కామన్. కానీ  క్రిస్మస్ సందర్బంగా పార్టీ డిఫరెంట్ గా ఉండాలంటే హోటల్స్ లో కాకుండా ఇంట్లోనే జరుపుకోండి. రంగురంగుల లైట్లతో ఇంటిని డిస్కోలా మార్చేసి ఎంజాయ్ చేయండి. 

7.  రొమాంటిక్ క్యాండల్ లైట్ డిన్నర్..
ఫ్రెండ్స్ తో పార్టీ సంగతి సరే..మరి మీ మనసుకి దగ్గరైనవారి సంగతేంటి.. అందుకే స్నేహితులతో పార్టీ పూర్తైన వెంటనే మీ మనసుకి దగ్గరైన వారితో రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయండి. ఇందులో క్రిస్మస్ స్పెషల్ రెసిపీస్ అన్ని ఉండేలా చూసుకోండి. కుదిరితే ఇంట్లో లేదంటే హోటల్లో అయినా ఓకే..

8. క్యాంప్ ఫైర్ వేసుకోండి
హడావుడి మొత్తం పూర్తైన తర్వాత ఇంటి ఆవరణలో కానీ దగ్గర్లో ఉన్న పెద్ద గ్రౌండ్ లో కానీ క్యాంప్ ఫైర్ వేసుకుని ఎంజాయ్ చేయండి. 
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చేరిన కోల్ కతా దుర్గామాత వేడుకలు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

Published at : 17 Dec 2021 09:40 PM (IST) Tags: Christmas 2021 Christmas christmas songs christmas music merry christmas christmas songs playlist best christmas songs christmas music 2021 merry christmas songs christmas song 2021 merry christmas 2022 christmas jazz last christmas

సంబంధిత కథనాలు

NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!

NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!

Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!

Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!

మే 27 రాశిఫలాలు, ఈ రోజు రాశులవారు మంచి గుర్తింపు పొందుతారు!

మే 27 రాశిఫలాలు, ఈ రోజు రాశులవారు మంచి గుర్తింపు పొందుతారు!

ఈ విగ్రహాలు ఇంట్లో అలంకరిస్తే అదృష్టం మీ వెంటే

ఈ విగ్రహాలు ఇంట్లో అలంకరిస్తే అదృష్టం మీ వెంటే

Impotance Of Conch:'శంఖం' సంపదకు ప్రతీకగా ఎందుకు చెబుతారు, దీన్ని ఎలా పూజించాలి!

Impotance Of Conch:'శంఖం' సంపదకు ప్రతీకగా ఎందుకు చెబుతారు, దీన్ని ఎలా పూజించాలి!

టాప్ స్టోరీస్

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

NTR centenary celebrations : తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !

NTR centenary celebrations :  తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !