అన్వేషించండి

Shami Puja 2023: అక్టోబరు 23 సాయంత్రం జమ్మిచెట్టు పూజకి శుభసమయం ఇదే!

దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి...శరన్నవరాత్రుల్లో ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకం. అన్నిటి కన్నా ముఖ్యమైనది దశమి. ఈ రోజు జమ్మిచెట్టుని పూజించడం వెనుక విశేషం ఇదే..

‌Dussehra 2023: ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా', దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటారు.   అక్టోబరు 23 సోమవారం మధ్యాహ్నం 3.15 నుంచి 3.40 మధ్యలో జమ్మిచెట్టుకి పూజ చేసేందుకు శుభసమయం...

  • తొలి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను
  • తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను
  • చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతారు.

అయితే మొదటి మూడు రోజుల్లో దుర్గాదేవిని పూజించలేని భక్తులు దుర్గాష్టమి, విజయదశమి రోజు పూజిస్తే అష్టైశ్వరాలతో కూడిన  సుఖజీవనం లభిస్తుంది. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్థులు  పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దినిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్ఫూర్తితో , పూర్వం రాజులు ఈ శుభ ముహూర్తాన్నే దండయాత్రకు ముహూర్తంగా నిర్ణయించుకునేవారని చెబుతారు.  అందుకే ఈ మూడు రోజులూ ఏ రోజుకారోజే ప్రత్యేకం.

Also Read: దసరాల్లో బాలలకు పూజ ఎందుకు చేస్తారు - దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!

దుర్గతులు తొలగించే దుర్గ
దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజిస్తారని చెబుతారు.  ఇక దుర్గ అంటే దుర్గమైనది. దుర్గతులను తొలగించేది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం. 'గ' అంటే నశింపచేసేది". ఈ రోజు దుర్గా ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు, చేరలేవు.   ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.  కోటి సూర్య ప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు ఆ తల్లి నామ జపంతో  తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో పూజించాలి.  వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు విజయ దశమి రోజు  అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టుపై తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేసి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు అప్పటి నుంచి పవిత్రతను సంతరించుకుంది. 

Also Read : శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం!

గంగను భువిపైకి తీసుకొచ్చింది మహర్నమవి
భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది మహర్నవమి రోజే అని చెబుతారు. ఇక ఈనవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈనవమి తిధి గురించి ఎందుకు చెబుతారంటే తొమ్మిదో  రోజు మంత్ర సిద్ది కలుగుతుంది. అందుకే అమ్మవారిని ఈ రోజున సిద్ది ధాత్రిగా పూజిస్తారు. పైగా తొమ్మిది అంకె ఎంతో విశిష్టమైనది. నవ నాడులు, నవరంధ్రాలు, నవ చక్రాలూ, నవ గ్రహాలు వీటన్నిటికీ నవ రాత్రులతో ఆధ్యాత్మిక పరమైన సంబంధం ఉందని చెబుతారు. తల్లి గర్భంలో శిశువు ఉండేది 9 నెలలు. కాశీ క్షేత్రంలో 9 నెలలు కానీ, 9 రోజులు కానీ, 9 గడియలు గానీ ఉంటే  పితృపాపాలన్నీ ఇట్టే తొలగిపోతాయట. శ్రవణం- కీర్తనం- స్మరణం- పాదసేవ- అర్చన- నమస్కారం- దాస్యం- సఖ్యత- ఆత్మ నివేదన  ఇవి నవ విధ భక్తిమార్గాలు. అన్నింటా తొమ్మిదినే ఎందుకు చెప్పుకుంటారంటే తొమ్మిది అంకె మార్పులకు లోను కాని "బ్రహ్మ తత్వాన్ని" సూచిస్తుంది. ఎందుకంటే 9 ని ఏ సంఖ్యతో గుణించినా తొమ్మిదే వస్తుంది. అంటే దీని శక్తి నిశ్చలం. "ఇదే బ్రహ్మ తత్వ రహస్యం." అంటే ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే నంబర్ అన్నమాట.

Also Read: దసరాకి ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా!

అమృతం పుట్టింది దశమి రోజే
దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజే అమృతం జనియించిందని చెబుతారు.  'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమని అందుకే  'విజయదశమి' అనుపేరు వచ్చిందంటారు. ఏపనైనా తిధి, వారము, తారాబలం, గ్రహబలం, ముహూర్తంతో సంబంధం లేకుండా విజయదశమి రోజు చేపడితే విజయం తథ్యం. 

ఈ శ్లోకం రాశి జమ్మిచెట్టుకి తగిలించండి
ఈ రోజు  'శమీపూజ' మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసం పూర్తైన వెంటనే పాండవులు వారివారి ఆయుధాలు, వస్త్రాలను శమీవృక్షంపై నుంచి తీసుకుని...  శమీవృక్ష రూపంలో ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున  రావణుని సహరించి విజయం పొందాడు. అందుకే పలుచోట్ల రావణ దహనం కార్యక్రమం జరుగుతుంది. ఇలా అందరూ నవరాత్రుల్లో  విజయదశమిరోజు సాయంత్రం శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని ఈ శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలుచేస్తారు.
శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
ఈ శ్లోకం రాసిన చీటీలు చెట్టుకొమ్మలు తగిలిస్తే అమ్మవారి కృపతో పాటూ సకల శుభాలు సిద్ధిస్తాయని, శనిదోష నివారణ కూడా జరుగుతుందని   భక్తుల విశ్వాసం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget