Saturday Donts: శనివారం ఈ తప్పులు చేస్తే శని దోషం ఖాయం..!
Saturday Donts: శనైశ్చరుడి కోపాన్ని లేదా శని దోషాన్ని ఎదుర్కోవడానికి ఎవరూ ఇష్టపడరు. కొన్ని పనుల వల్ల శని ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. శనివారం ఏ పని చేస్తే ఆయన ఆగ్రహిస్తాడో తెలుసా..?
![Saturday Donts: శనివారం ఈ తప్పులు చేస్తే శని దోషం ఖాయం..! do not do these mistakes and do not purchase these things on saturday to avoid shani angry Saturday Donts: శనివారం ఈ తప్పులు చేస్తే శని దోషం ఖాయం..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/5c5b4f9203f101f0ce66fb5c23cfb3311686331872735691_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Saturday Donts: శనిదేవుని అనుగ్రహం పొందడానికి ప్రతి శనివారం ఆయనను పూజించాలని విశ్వసిస్తారు. శనైశ్చరుడు న్యాయాన్ని ఇష్టపడే దేవుడు. మనుషుల కర్మలను బట్టి వారికి ఫలాలను ఇస్తాడు. శనైశ్చరుడు ఎవరినైనా దయతలిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా వారి జీవితం ఆనందంగా సాగిపోయేలా కరుణిస్తాడు. అయితే శని చెడు దృష్టి ఎవరిపై పడితే, అతని జీవితం కష్టాలతో నిండి పోతుంది. దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాదు.
శని దేవుడు మనిషి చేసే కొన్ని పనులకు త్వరగా కోపగించుకుంటాడు. దీని కారణంగా ఒక వ్యక్తి తాను చేపట్టే ఏ పనిలోనైనా నష్టాన్ని లేదా కష్టాన్ని అనుభవిస్తాడు. శనిదేవుని విషయంలో పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని మీరు శనివారం నాడు పాటించాలి. ఆ రోజు మీరు ఎలాంటి తప్పులు చేయకూడదని గుర్తుంచుకోండి.
Also Read : ఈ 4 వస్తువులను చేతికి అందుకోకూడదు, ఉచితంగా అస్సలు తీసుకోరాదు!
1. ఇవి కొనుగోలు చేయవద్దు
మీరు శనివారం ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదు, ఇంటికి తీసుకురాకూడదు. ఇలా చేయడం వల్ల శనిదేవుడికి మీపై కోపం వస్తుంది.
2. ఉప్పు కొంటే అప్పు తప్పదు
ప్రజలు శనివారం ఉప్పు కొనుగోలుకు దూరంగా ఉండాలి. ఈ రోజు ఉప్పు కొనడం వల్ల ఆ వ్యక్తికి అప్పులు పెరుగుతాయి. అదే సమయంలో ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుందని నమ్ముతారు.
3. కత్తెర కొనవద్దు
శనివారం రోజున కత్తెర కొనడం లేదా బహుమతిగా ఇవ్వడం చేయకూడదు. శనివారం కత్తెర వ్యాపారం చేయడం వల్ల కుటుంబ కలహాలు పెరుగుతాయని నమ్ముతారు.
4. పెద్దలను అగౌరపర్చడం
పెద్దలను వీలైనంతగా గౌరవించండి, పెద్దలను గౌరవించకపోతే శనిదేవుడు ఆగ్రహిస్తాడు. పెద్దలను అవమానించడం శని క్రూరమైన దృష్టికి కారణమవుతుంది.
5. కాళ్లు ఈడుస్తూ నడవడం
కాళ్లను నేలకు ఈడ్చి నడిచే వ్యక్తులను మీరు గమనించే ఉంటారు. అలాంటి వారిపై శని దేవుడు ఎప్పుడూ కోపంగా ఉంటాడు. అలాంటి వారు ఏ పనికి పూనుకున్నా, ఆ పనిలో ఆటంకాలు ఏర్పడి, చేసే పని సగంలోనే ఆగిపోతుంది.
6. పాత్రలను తోమకుండా ఉంచడం
వంటగదిలో భోజనం చేసిన వెంటనే పాత్రలను తోమకుండా ఉంచడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది. శని దేవుడు ఇలా చేసే వారికి కష్టాలను పెంచుతాడు.
శని ఆగ్రహాన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు. ఈ కారణంగా చాలా మంది శని అంటే భయపడతారు. పైన పేర్కొన్న వస్తువులు శనివారం నాడు కొనుగోలు చేసినా, చేయకూడని పనులు చేసినా శనిదేవుని ఆగ్రహానికి గురవుతాం.
Also Read : శని ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? శనివారం ఈ పని చేయండి!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)