News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Shani: శ‌ని ప్ర‌భావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? శ‌నివారం ఈ ప‌ని చేయండి!

shani dev: జాత‌కంలో శ‌ని ప్ర‌తికూల‌ ప్ర‌భావం చూపితే ఎంత‌టి వారికైనా క‌ష్టాలు త‌ప్ప‌వు. శ‌నైశ్చ‌రుడిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి శ‌నివారం చేసే ఈ ప‌నులు మెరుగైన ఫలితాన్ని ఇస్తాయి.

FOLLOW US: 
Share:

Lord Shani: హిందూ సంప్ర‌దాయంలో శనివారం శనైశ్చ‌రుడికి ప్రీతిక‌ర‌మైన రోజుగా విశ్వ‌సిస్తారు. ఆయ‌నను సంతుష్టుడిని చేస్తే మ‌న‌ కష్టాలను, ఇబ్బందుల‌ను తొలగిస్తాడ‌ని భావిస్తారు. కాబట్టి, ఈ రోజు సంప్ర‌దాయం ప్ర‌కారం కొన్ని ప‌నులు చేస్తే, శ‌నైశ్చ‌రుడు ప్ర‌స‌న్న‌మై వారి జీవితాల్లోని ప్ర‌తికూల‌త‌ల‌ను తొల‌గిస్తాడ‌ని పెద్ద‌లు చెబుతారు. మ‌రి శ‌నివారం రోజు చేయాల్సిన ఆ కార్య‌క్ర‌మాలు ఏమిటో, వాటిని ఎలా నిర్వహించాలో చూద్దాం.

హైంద‌వ సంస్కృతిలో వారంలోని ప్రతి రోజు ఒక నిర్దిష్ట దేవతకు అంకితం చేశారు. ఈ క్ర‌మంలోనే శనివారం శనైశ్చ‌రుడికి ఇష్ట‌మైన రోజుగా భావిస్తారు. ఈ రోజు ప్రజలు దేవాలయాలకు వెళ్లి ఆయ‌న‌కు తైలాభిషేకం చేస్తారు. జాత‌కంలో శ‌ని ప్ర‌భావం కార‌ణంగా, ఒక వ్యక్తి తన జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటాడు. అదే స‌మ‌యంలో శని సానుకూల ప్ర‌భావంతో ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో పురోగతిని ఎవరూ ఆపలేరు. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అనేక మార్గాలు పురాణాల్లో సూచించారు. వీటిలో శనైశ్చ‌రుడిని ప్రసన్నం చేసుకునేందుకు శ‌నివారం నాడు నల్ల కుక్కకు ఆహారం పెట్ట‌డం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకుందాం.

శనైశ్చ‌రుడిని ప్ర‌స‌న్నం చేసుకోవడానికి ఉత్తమ మార్గాలు

1. జ్యోతిషశాస్త్రంలో, నల్ల కుక్కను శని దేవుడి వాహనంగా భావిస్తారు. ఆయ‌న‌ను ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం నల్ల కుక్కకు నెయ్యితో చేసిన రొట్టె తినిపించాల‌ని చెబుతారు. ఈ పరిహారం చేయడం ద్వారా, వారి జీవితంలో త్వరలో సానుకూల ప్రభావాలను చూస్తారు.

2. శనివారం నాడు నల్లకుక్కను చూడటం ద్వారా మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని, గ‌తంలో ఆగిపోయిన‌ మీ పనులన్నీ పూర్తవుతాయని చెబుతారు.

Also Read: ఇలాంటి పనులు చేస్తే నవగ్రహాల ఆగ్రహానికి గురికాతప్పదు!

3. ఆవనూనెతో చేసిన ఆహార ప‌దార్థాల‌ను శనివారం నల్ల కుక్కకు తినిపిస్తే, రాహు-కేతువులకు సంబంధించిన దోషాలు కూడా మీ జీవితం నుండి తొలగిపోతాయి.

4. శని దేవుడే కాకుండా, కాల భైరవుడి వాహ‌నంగా నల్ల కుక్కను పరిగణిస్తారు, కాబట్టి నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం ద్వారా జీవితంలో ఎదుర‌య్యే తీవ్రమైన ప్రమాదాల‌ను నివారించవచ్చు.

5. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం ద్వారా కాలసర్ప దోషం వంటి భయంకరమైన దోషాలు తొలగిపోతాయి.

6. శనివారం నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం వల్ల ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం చెలాయించలేవు.

7. శనివారం నల్ల కుక్కకి రొట్టెలు తినిపిస్తే మీ అప్పులన్నీ త్వరగా తీరుతాయి. మీరు పనిచేసే రంగంలో ఘ‌న‌ విజయం సాధిస్తారు, మీరు భ‌విష్య‌త్‌లో రుణం తీసుకోవలసిన అవసరం ఉండ‌దు.

Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

8. శనివారం నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం వలన శని దోషం, అర్ధాష్ట‌మ‌ శని ప్ర‌భావం నుంచి ఉపశమనం లభిస్తుంది.               

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు. 

Published at : 21 Apr 2023 05:00 AM (IST) Tags: shani dev black dog feed a black dog on saturday

ఇవి కూడా చూడండి

Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో  ముఖ్యమైన రోజులివే!

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

Horoscope Today December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..

Horoscope Today  December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..

Christmas 2023: క్రిస్మస్ వేడుకలు‌ డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!

Christmas 2023: క్రిస్మస్ వేడుకలు‌ డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!

టాప్ స్టోరీస్

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

Fact Check: కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో పాకిస్థాన్ జెండా అంటూ వీడియో వైరల్ - ఇందులో నిజమెంత?

Fact Check: కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో పాకిస్థాన్ జెండా అంటూ వీడియో వైరల్ - ఇందులో నిజమెంత?