By: RAMA | Updated at : 08 Apr 2023 05:55 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
Navagraha: జాతకంలో గ్రహాల సంచారం సరిగా లేకపోతే రకరకాల ఇబ్బందులకు గురికాకతప్పదు. అయితే వాటి సంచారం బాగున్నా, బాగోపోయినా కొన్ని పనులు చేసేవారిపై నవగ్రహాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయని చెబుతారు పండితులు...
ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకునే సూర్యభగవానుడికి పితృదేవతలను దూషిస్తే కోపం వస్తుంది. నమస్కార ప్రియుడు, తర్పణ గ్రహీతగా చెప్పే సూర్యుడికి పెద్దలను దూషిస్తే కోపం వస్తుంది. ఇలాంటి పనులు చేస్తే సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు. ముఖ్యంగా సూర్య దేవుని ఎదురుగా మల మూత్ర విసర్జన , దంతావధానం చేయకూడదని చెబుతారు పండితులు.
అద్దం పుట్టడానికి కారణం చంద్రుడు అని చెబుతారు. అందుకే అద్దంలో దిగంబరంంగా చూసుకోవడం, వెక్కిరించడం, వింతవింత హావభావాలు ప్రదర్శించడం చేయరాదు. ఇలాంటి పనులు చేస్తే చంద్రుడి ఆగ్రహానికి గురవుతారు
Also Read: మానసిక ఇబ్బందులు, వైవాహిక జీవితంలో వివాదాలు - శుక్రుడి సంచారం ఈ 6 రాశులవారికి అస్సలు బాలేదు
కుజుడుకి ఎవరైనా అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతో కోపం వస్తుందట. ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించి మోసం జరిగితే కుజుడు ఆగ్రహం నుంచి అస్సలు తప్పించుకోలేరని చెబుతారు పండితులు
ఒక్కక్కరికి ఒక్కో అవలక్షణం ఉంటుంది. కొన్ని బయటకు కనిపిస్తాయి ఇంకొన్ని కనిపించవు. ముఖ్యంగా నోట్లో వేలుపెట్టుకోవడం, ముక్కులో వేలుపెట్టుకోవడం చేస్తుంటారు. అయితే బుధుడికి మాత్రం చెవిలో వేలుపెట్టి తిప్పుకునేవారంటా పరమ చిరాకట. అందులోనూ బుధవారం ఇలాంటి పనులు చేస్తే అస్సలు సహించడు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, తెలివైనోడిని అని విర్రవీగినా వాళ్ల సరదా బుధుడు తీర్చేస్తాడని చెబుతారు.
దేవతల గురువుగా చెప్పే బృహస్పతికి..ఎవరైనా గురువుని కించపరిస్తే ఆగ్రహం చెందుతాడు.విద్యాబుద్ధులు నేర్పించి, ఉన్నతంగా తీర్చి దిద్దిన గురువులపట్ల భక్తి, శ్రద్ధ ఉండాలికానీ దూషించడం సరికాదు. గురువుని కించపరిస్తే ఆగ్రహించే గురువు...వారిని పూజించి గౌరవిస్తే మాత్రం అనుగ్రహిస్తాడట.
శుక్రుడికి బంధాల మధ్య వివాదాలంటే కోపం. ప్రేమ కారకుడిగా చెప్పే శుక్రుడు..భార్య-భర్త మధ్య బంధం సరిగా లేకున్నా, ఒకర్నొకరు అగౌరవ పరుచుకున్నా అస్సలు నచ్చదు. మరీ ముఖ్యంగా శుచీ శుభ్రత లేని ఇల్లు, నిత్యం గొడవలు జరిగే ఇంటిపై శుక్రుడి ఆగ్రహం ఉంటుంది.
Also Read: వృషభ రాశిలో ప్రవేశించిన శుక్రుడు, ఈ 6 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
శని...ఈ పేరు వింటేనే వణికిపోతారు. ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో దశలో శని కారణంగా బాధపడని వారుండరు. అయితే ఏలినాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని...జీవితకాలంలో వీటినుంచి తప్పించుకోలేరు...అయితే ఎలాంటి శని బాధలు లేనివారు కూడా శని ఆగ్రహానికి గురవుతారు. వాళ్లెవరంటే...పెద్దల్ని కించపరిచేవారు, మురుగుదొడ్లు శుచిగా ఉంచనివారు, తల్లిదండ్రులను చులకనగా చూసేవారిపై శని ఆగ్రహం ఉంటుంది.
నవగ్రహాల్లో రాహువుకి ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా...వైద్య వృత్తి పేరుతో మోసం చేసేవారిపై, సర్పాలను ఏమైనా చేసినా రాహువు ఆగ్రహానికి గురికాకతప్పదు.
జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన వారిపై కేతువు ఆగ్రహం చెందుతాడు. మోక్ష కారకుడు అయిన కేతువుకి... పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు. జాతకంలో కేతువు సంచారం బాగాపోతే పిశాచపీడ కలుగుతుంది.
Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!
Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్టత తెలుసా!
జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి
Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది
Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?