వృషభ రాశిలో శుక్ర సంచారం, ఈ రాశులవారికి బాలేదుసుఖ, సంతోషాలనిచ్చే శుక్రుడు ఏప్రిల్ 6న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ ప్రభావంతో ఆరు రాశులవారు అప్రమత్తంగా ఉండాలిఏప్రిల్ 6న వృషభరాశిలోకి ప్రవేశించాడు. మే 2వ తేదీ వరకూ వృషభ రాశిలోనే సంచరిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలను సూచిస్తోంది..ఆ రాశులేంటంటే..మిథున రాశి
ఏప్రిల్ 6న శుక్రుడు వృషభరాశిలో అడుగుపెట్టాడు. ఈ సమయం మీకు అనుకూలంగా లేదు. శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నంత వరకూ మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణ కోసం ప్లాన్ చేసుకుంటే కొంతకాలం ఆగడమే మంచిది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండవచ్చుసింహ రాశి
వృషభ రాశిలో శుక్రుడి సంచారం సింహరాశి వారికి పెద్దగా కలసిరాదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పదు. అత్యవసరం అయితే కానీ ప్రయాణం చేయకపోవడమే మంచిది. విలువైన వస్తువులు జాగ్రత్త.వృశ్చిక రాశి
వృషభ రాశిలో శుక్రుడి సంచారం వృశ్చిక రాశికి అనుకూలంగా లేదు. ఉద్యోగులకు కార్యాలయంలో అడ్డంకులు ఎదురవుతాయి. అధికారుల నుంచి మాటలు పడతారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. వివాదాలు మీ సంబంధాన్ని బలహీనపరుస్తాయి.ధనుస్సు రాశి
శుక్రుడు రాశి మార్పు ప్రభావం ధనస్సు రాశివారిపై మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో ధన నష్టం కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల విషయంలో ఇబ్బందులు పడతారు. దుబారా తగ్గించుకోవడం మంచిది. అప్పులు చేయాల్సి వస్తుంది.మీన రాశి
వృషభ రాశిలో శుక్రుడి సంచారం మీనరాశివారికి ప్రతికూల ఫలితాలనిస్తోంది. నెల రోజుల పాటూ ఈ రాశి ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. దుబారాకు దూరంగా ఉండండి...లేదంటే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది.నోట్: ఆయా రాశుల్లో ఫలితాలు ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

ఈ రాశులవారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

View next story