ఈ రాశులవారికి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది
(06-04-2023)మేషం
ఈ రాశివారికి తెలియని భయం వల్ల పని దెబ్బతింటుంది. మీ మాటతీరు మార్చుకునేందుకు ప్రయత్నించండి. కుటుంబంతో సంతోషం ఉంటుంది. చెడు సహవాసాన్ని వదులుకోవడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకూ తగ్గుతాయి.వృషభం
ఈ రాశివారు ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలలను ఓ ప్రణాళిక ప్రకారం చేయండి. ఆర్థిక పురోగతి ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది.పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుందిమిధునం
ఈ రాశి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో కిందిస్థాయి అధికారుల సహకారం లభిస్తుంది. అసూయపడే వారి నుంచి జాగ్రత్త అవసరం. కుటుంబ ఆందోళనలు అలాగే ఉంటాయి.కర్కాటకం
ఈ రాశివారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. అవసరమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. అలసట ఉండొచ్చు.సింహ రాశి
ఈ రాశివారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం విస్తరిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం , శాంతి ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అదృష్టం కలిసొస్తుంది.కన్యా
ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రిస్క్ తీసుకునే ధైర్యం చేయగలరు. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. తొందరగా అలసిపోతారు.తులా
కెరీర్‌లో ఆశించిన విజయం సాధిస్తారు. ఊహించని లాభం ఉండవచ్చు. బెట్టింగ్, లాటరీలకు దూరంగా ఉండండి. వ్యాపారం విస్తరిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు.తలపెట్టిన పనిలో సక్సెస్ అవుతారు.వృశ్చికం
మీలో ఏదో తెలియని భయం అలాగే ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. లావాదేవీల్లో తొందరపాటువల్ల నష్టం జరుగుతుంది. శారీరక ఇబ్బంది ఉండొచ్చు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండిధనుస్సు
ఈ రాశివారికి మానసిక ఆందోళన వెంటాడుతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. లాభదాయకమైన అవాకశాలు చేతికందుతాయి. కార్యాలయంలో అధికారుల నుంచి మీకు మద్దతు ఉంటుంది. ఇతరుల పనుల్లో జోక్యం వద్దు.మకరం
ఈరోజు ఈ రాశివారికి మానసిక ఆనందం ఉంటుంది. కొన్ని పనులు నిలిచిపోవచ్చు. కొత్త ప్రణాళిక రూపొందిస్తారు. సామాజిక సేవ చేసే అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.కుంభ రాశి
మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. సంతోష సాధనాలు సమకూరుతాయి. వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు ఉంటుంది.మీన రాశి
మీకు తెలియని సంఘటనలు మీ చుట్టూ జరిగే అవకాశం ఉంది. సన్నిహితులతో వాగ్వాదాలు ఉండొచ్చు. భాగస్వాములతో విభేదాలు రావచ్చు.భారీ వస్తువులను జాగ్రత్తగా వాడండి. ఇతరుల నుంచి ఏమీ ఆశించవద్దు.


Thanks for Reading. UP NEXT

ఈ రాశివారు మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి

View next story