ఈ 6 రాశులవారు ఈ వారం (ఏప్రిల్ 03 నుంచి 09) ఆలోచించి అడుగేయండి
వృషభ రాశివారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు అనకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. తొందరగా అలసిపోతారు కానీ అనుకున్న పని సక్సెస్ అవడంతో సంతోషంగా ఉంటారు.
వృషభ రాశి వ్యాపారులు ఎవ్వరి ప్రలోభాలకు లోనుకావొద్దు. డబ్బు వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చాలని ఆలోచిస్తే..తొందరపడొద్దు. జీవిత భాగస్వామి భావాలను విస్మరించకుండా ఉంటే వావైహిక జీవితం బావుంటుంది
మిథున రాశివారు ఈ వారం బిజీబిజీగా ఉంటారు. ఈ వారం మీరు ఇల్లు, కార్యాలయానికి సంబంధించిన బాధ్యతలను నెరవేర్చడానికి అదనపు కృషి చేయవలసి ఉంటుంది. వారం ప్రారంభంలో, మీరు భూమి మరియు ఆస్తికి సంబంధించిన విషయాలను పరిష్కరించే ప్రయత్నాల్లో ఉంటారు.
మిథున రాశి వ్యాపారులు పోటీదారులతో కఠినమైన పోటీని ఎదుర్కొంటారు. ఉద్యోగులు వారం ద్వితీయార్ధంలో తమ పని ప్రదేశంలో ప్రత్యర్థులపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం , ఆహారంపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
కర్కాటక రాశివారు ఈ వారం కొంచెం కష్టపడితేనే విజయం సొంతం అవుతుంది. మీరు తలపెట్టిన పనులు కొన్నింటికి ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆలస్యంగా అయినా పనులు పూర్తవుతాయి. వ్యాపారం, ఉద్యోగానికి సంబంధించి తీసుకునే నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి.
కర్కాటక రాశివారు ఈ వారం ప్రయోజనకరమైన ప్రయాణం చేస్తారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం, ఆహారం విషయంలో అజాగ్రత్తకు దూరంగా ఉండండి.
ఈ వారం తులా రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు..ఆలోచించాలి, అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. భాగస్వామ్యం వ్యాపారం చేసేవారు డబ్బులకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
తులా రాశి విద్యార్థులు ఆశించిన విజయాన్ని సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. మీ సుఖదుఃఖాల్లో జీవిత భాగస్వామి నీడలా మీకు తోడుగా నిలుస్తారు.
వృశ్చిక రాశివారికి ఈ వారం సవాలుగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీ పని లేదా వ్యాపారానికి సంబంధించిన కొన్ని అడ్డంకులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. చేతికి అందాల్సిన డబ్బు రావడానికి ఇబ్బందులు ఉండొచ్చు.
వృశ్చిక రాశికి చెందిన నిరుద్యోగులకు మరికొంతకాలం నిరీక్షణ తప్పదు. కార్యాలయంలో మీ ప్రత్యర్థులు చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు జాగ్రత్తపడాలి. దంపతులు లేదా ప్రేమికుల మధ్య మూడో వ్యక్తి మితిమీరిన జోక్యం వల్ల విభేదాలుంటాయి.
మీన రాశివారికి ఈ వారం కాస్త ఒడిదుడుకులు ఉంటాయి. వారం ప్రారంభంలో అదనపు పనిభారం ఉండవచ్చు. దీన్ని సకాలంలో చేయాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ పనిని మరొకరికి వదిలివేయకుండా చాలా జాగ్రత్తగా చేయండి.
మీనరాశి వ్యాపారులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి లేదా దానిని తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి అప్పు చేయాల్సి రావొచ్చు. ఈ వారం ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వైవాహిక జీవితంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి.