ఈ ఏడాది మేషరాశి రాజకీయనాయకులకు శనిబలం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రజల్లో - అధిష్టానం నుంచి మంచి పేరు సంపాదించుకుంటారు. ఈ రాశి వారు ఈ సారి ఎన్నికల్లో పోటీచేస్తే విజయం తథ్యం.
వృషభ రాశికి చెందిన రాజకీయనాయకులకు కూడా శోభకృత్ నామ సంవత్సరం అత్యద్భుతంగా ఉంటుంది. శత్రువులు ఎన్ని స్కెచ్చులేసినా మీదే పైచేయి. ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతారు.
మిథున రాశికి చెందిన రాజకీయనాయకులకు ఈ ఏడాది బావుంటుంది. ఎన్నికల్లో పోటీచేస్తే విజయం సాధిస్తారు. మంచి పదవి పొందుతారు. అధిష్టానం అనుగ్రహం పొందుతారు.
కర్కాటక రాశికి చెందిన రాజకీయ నాయకులకు గురుబలం బాగా కలిసొస్తుంది. చివరకి వరకూ విజయం దోబూచులాడినా ఎట్టకేలకు విజేతగా నిలుస్తారు. అయితే శని ప్రభావం వల్ల మనోధైర్యం కోల్పోతారు..శత్రువుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సింహ రాశి రాజకీయనాయకులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలున్నాయి. గెలుపు దరిచేరింది అనిపించినా చివరి నిముషంలో సమీకరణాలు మారిపోతాయి. డబ్బులు ఖర్చు అయినా అందుకు తగిన ఫలితం దక్కడం కష్టమే
కన్యా రాశి రాజకీయనాయకులకు ఈ ఏడాది అనుకూలంగా లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పొందుతారు. అధిష్టాన వర్గంలోనూ మీపై సదభిప్రాయం ఉండదు. ఎన్నికల్లో పోటీచేసినా విజయం సాధిస్తారనే నమ్మకం లేదు..శత్రువర్గం ఆరోపణల వలయంలో చిక్కుకుంటారు
తులా రాశి రాజకీయనాయకులకు గ్రహసంచారం బాగా లేకపోవడం ఆటంకాలు తప్పవు. ప్రజల్లో , అధిష్టాన వర్గంలోనూ మీపేరు, గుర్తింపు తగ్గుతుంది. శత్రువులవలన ఇబ్బందులు ఉండొచ్చు. నమ్మినవారే దగాచేస్తారు. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది కానీ ఫలితం ఉండదు
వృశ్చిక రాశికి చెందిన రాజకీయ నాయకులకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అధిష్టాన వర్గం నుంచి ప్రశసంలుంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మీ ముందు మోకరిల్లుతారు.ఎన్నికల్లో విజయం సాధిస్తారు..
ధనస్సు రాశి రాజకీయ నాయకులు ప్రజాభిమానం విశేషంగా పొందుతారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. అధిష్టానం నుంచి పేరు సంపాదించుకుంటారు. ఎన్నికల్లో పోటీచేస్తే విజయం మీదే అవుతుంది.
మకర రాశి రాజకీయనాయకులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బాగా కలిసొస్తుంది. గతేడాదికన్నా అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. ప్రజల్లో ఫాలోయింగ్ పెరుగుతుంది..అధిష్టానం నుంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు కూడా మీకు సహాయపడతారు
కుంభ రాశికి చెందిన రాజకీయనాయకులకు ఈ సంవత్సరం గడ్డుకాలమే. ప్రజల్లో మీపై విశ్వాసం ఉండదు. అధిష్ఠాన వర్గంలోనూ సదభిప్రాయం ఉండదు. నమ్మినవారే దగా చేస్తారు. మీతో ఉన్నవారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు జాగ్రత్త.
మీన రాశికి చెందిన రాజకీయనాయకులకు అంత అనుకూలంగా లేదు. ప్రజలు, అధిష్టానం నుంచి మంచి పేరు పొందలేరు. ఎన్నికల్లో పోటీచేసినా ఓటమి పాలవక తప్పదు. పార్టీలు మారే పరిస్థితి ఉంటుంది. డబ్బు అధికంగా ఖర్చు చేసినా ఫలితం ఉండదు