ఈ వారం (ఏప్రిల్ 03 నుంచి 09) ఈ రాశులవారికి బాగా కలిసొస్తుంది
ఈ వారం మేష రాశి వారికి సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆశించిన విజయం అందుకుంటారు. వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ముఖ్యమైనవి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.
మేషరాశికి చెందిన రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి పెద్ద పదవి లేదా బాధ్యత లభిస్తుంది. పరీక్ష-పోటీలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఆశించిన విజయం లభించే అవకాశం ఉంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
ఈ వారం కర్కాటక రాశి వారికి శుభఫలితాలున్నాయి. వృత్తి- ఉద్యోగం-వ్యాపారాలలో ఆశించిన పురోగతిని చూస్తారు. వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఇదే మంచి సమయం. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం లభిస్తుంది.
కర్కాటక రాశివారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది
సింహరాశివారికి ఈ వారం చాలా బావుంది. కొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న అదృష్టం ఈ వారం మీకు తోడుగా రానుంది. పని ప్రదేశంలో మీ స్థాయి , స్థానం రెండూ పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులైన మహిళలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది.
సింహరాశికి చెందిన వారు పూర్వీకుల ఆస్తిని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు అందుతాయి. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
ధనస్సు రాశివారికి ఈ వారం వృత్తి, వ్యాపారాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు వారం మధ్యలో ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి.
ధనస్సు రాశివారు ఈ వారం ఆరోగ్యం , ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. అయితే మీరు కుటుంబానికి, పరస్పర సంబంధాలకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదు.. వారం ద్వితీయార్థంలో అపార్థాలు క్లియర్ అవుతాయి
మకర రాశివారికి ఈ వారం ప్రారంభం నుంచి అనుకున్నపనులు పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు వృత్తి లేదా వ్యాపారం కోసం ఏ ప్రణాళిక వేసినా విజయవంతమవుతుంది - ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగుల నిరీక్షణ ఈ వారం ఫలిస్తుంది.
మకర రాశివారు ఈ వారం పెట్టుబడులు పెట్టేముందు నిపుణుడు లేదా మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతి లభిస్తుంది. ప్రేమ జీవితం ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
కుంభ రాశివారికి ఈ రాశివారికి గడిచిన వారంకన్నా బావుంటుంది. ఈ వారం మీరు మీ సమయాన్ని, శక్తిని పూర్తిగా వినియోగిస్తే ఊహించినదానికన్నా ఎక్కువ ఫలితాలు పొందుతారు. వృత్తి-వ్యాపారాల దిశగా చేసే ప్రయత్నం విజయవంతమవుతుంది.
కుంభరాశి ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అదనపు ఆదాయ వనరులను వెతుక్కుంటారు. వారం చివరిలో రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పెద్ద కోరిక నెరవేరుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.