ఈ రాశివారు ఖర్చులు తగ్గించాలి
(03-04-2023 రాశిఫలాలు)



మేష రాశి
ఈ రోజు మీకు పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు పోటీ రంగంలో ముందుకు సాగుతారు. అవివాహితులకు ఉత్తమ వివాహం కోసం ప్రతిపాదనలు ఉండవచ్చు.



వృషభ రాశి
ఈ రోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం సంతోషంగా ఉంటుంది. భావోద్వేగ విషయాలలో మీరు మెరుగ్గా ఉంటారు.మీ సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. ప్రేమికులు మూడో వ్యక్తి జోక్యం వల్ల ఇబ్బంది పడతారు.



మిథున రాశి
ఈ రోజు మీలో ధైర్యం, బలం పెరుగుతుంది. బంధువుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. తలపెట్టిన పని పూర్తిచేయకపోవడం వల్ల ఏదో నిరాశ ఉంటుంది. పాత రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ సమస్యల గురించి ఉపాధ్యాయులతో మాట్లాడతారు



కర్కాటక రాశి
ఈ రోజు మీకు సంపద పెరుగుతుంది. రక్త సంబంధ సంబంధీకులను కలుస్తారు...ఓ శుభకార్యం నిర్వహణ గురించి ఆలోచిస్తారు. స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఉద్యోగులు పని ప్రదేశంలో ఏదైనా తప్పుచేస్తే వెంటనే సరిచేసుకోవడం మంచిది.



సింహ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. సృజనాత్మక పనుల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీ మాటతీరుతో అందర్నీ ఆకర్షిస్తారు. కొత్త ప్రణాళికలు అమలు చేయడం మంచిది. నూతన పెట్టుబడులకు మంచి రోజు. మీ రంగంలో మీరు వృద్ధి చెందుతారు.



కన్యా రాశి
ఈ రోజు ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత పాటించాలి. ఖర్చులు తగ్గించకపోతే భవిష్యత్ లో ఇబ్బంది పడతారు. కార్యాలయంలో మీకు రహస్య శత్రువులు ఉన్నారు..జాగ్రత్త పడండి. భాగస్వామ్య వ్యాపారం పెద్దగా కలసిరాదు. వ్యాపారంలో నూతన ప్రణాళికల ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.



తులా రాశి
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. న్యాయపరమైన విషయాల్లో అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదిస్తే మంచిది. ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. సీనియర్లతో మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్త. వ్యాపారులకు కొన్ని సమస్యలు తప్పవు.



వృశ్చిక రాశి
ఈ రోజు పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి . మీ స్థానం పెరగడంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఏదైనా శుభకార్యంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ పని వేగం మందగిస్తుంది, అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తిచేస్తారు.



ధనుస్సు రాశి
ఈ రోజు మీలో ధైర్యం, బలం పెరుగుతాయి. కొన్ని వ్యాపార ప్రణాళికలు వేసే ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు దీర్ఘకాలంగా నిలిపివేసిన కొన్ని పనులు పూర్తవుతాయి. ఈ రోజు డబ్బుకు సంబంధించిన విషయాలలో కూడా మంచి రోజు అవుతుంది. మితిమీరిన ఉత్సాహంతో ఏ పనీ చేయనవసరం లేదు.



మకర రాశి
ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఏదైనా సమస్య ఎదురైతే నిర్లక్ష్యం చేయకండి.ఈరోజు మీరు ఏ కొత్త పని చేయక తప్పదు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయవచ్చు.ఉపాధి కోసం ఇబ్బంది పడే వారు మరికొంత కాలం ఆందోళన చెందాల్సి ఉంటుంది.



కుంభ రాశి
ఈ రోజు వ్యాపారం చేసే వారికి మంచి రోజు. మీరు పనిప్రాంతంలో మీ మంచి ఆలోచనలను సద్వినియోగం చేసుకుంటారు. కొన్ని ముఖ్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.



మీన రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీరు మీ పనిలో గొప్ప అవగాహనతో ముందుకు సాగాలి. ఉద్యోగం చేసేవారు పదోన్నతి కారణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి మారవలసి ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా సలహా ఇచ్చే ముందు సీనియర్ సభ్యులతో మాట్లాడాలి.