ఈ రాశివారు మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి
(05-04-2023)



మేష రాశి
ఈ రోజు ఈ రాశివారికి ఆదాయం బావుంటుంది..అదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి. ఇష్టమైన పని చేయడం వల్ల రోజంతా సంతోషంగా ఉంటారు. అయితే వివాదాలకు దూరంగా ఉండాలి. ఎవ్వరి దగ్గరా అప్పు తీసుకోవద్దు. అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించవద్దు.



వృషభ రాశి
ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మనసులో ఏదో భయం ఉంటుంది. ఏ పనీ చేయాలని అనిపించదు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొచ్చు. మీరు చేయాలనుకున్న పనిని చేయండి. పిల్లలతో సమయం గడిపేందుకు ప్రయత్నించండి.



మిథున రాశి
ఈ రాశివారు ఈ రోజంతా బిజీబిజీగా ఉంటారు. విదేశాల్లో వ్యాపారం చేసేవారు లాభపడతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు ఉన్నత అవకాశం పొందుతారు..కానీ..మీరు పాత ఉద్యోగంలోనే కొనసాగడం మీకు మంచిది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.



కర్కాటక రాశి
ఈ రోజు మీకు లాభదాయకమైన రోజు. పనిచేసే ప్రదేశంలో చర్చ జరిగే పరిస్థితి ఉంటే మీరు ఒకవైపు ఉండాలి . వ్యాపారం చేసేవారు ఆకర్షణీయంగా మాట్లాడగలగాలి. ఉద్యోగులు టార్గెట్లు పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. మీరు ఊహించని సమస్యలు కొన్ని వస్తాయి.. అయి నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.



సింహ రాశి
ఈ రోజు మీ మనస్సులో ఉత్సాహం నెలకొంటుంది. కుటుంబంలో చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు. దీనివల్ల మీ అలసట, ఒత్తిడి దూరమవుతాయి. పనితో సంబంధం ఉన్న వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు...ఎవరినీ దూషించకుండా ఉండాలి.



కన్యా రాశి
ఈ రోజు మీకు పురోభివృద్ధితో కూడిన రోజు అవుతుంది. వ్యాపారులకు ఈ రోజు మెరుగ్గా ఉంటుంది..ఎన్నాళ్ల నుంచో ఆగిపోయిన ప్రణాళికలు పూర్తవుతాయి. భాగస్వామిని గుడ్డిగా నమ్మకూడదు. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది.



తులా రాశి
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. మీ ఆశయం నెరవేరుతుంది. మీ మనసులో కొన్ని భావాలు జీవిత భాగస్వామితో పంచుకోవడం ద్వారా మీలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ద్యార్థులు బలహీనమైన సబ్జెక్టులపై దృష్టి సారించాలి. జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి.



వృశ్చిక రాశి
ఈ రోజు ఆరోగ్య పరంగా మీకు కొంత ఇబ్బంది కలిగించే రోజు...నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగితే మౌనంగా ఉండడం మంచిది. బెట్టింగులో డబ్బులు పెట్టేవారు ఆ ఆలోచన విరమించుకోవడం మంచిది.



ధనుస్సు రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టేముందు కుటుంబ సభ్యుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది. అకాస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. సాయంత్రం లోగా ముఖ్యమైన సమాచారం వినే అవకాశం ఉంది.



మకర రాశి
మీ చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంతానం కొత్త ఉద్యోగం పొందారన్న వార్త మీలో సంతోషాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యుల వివాహానికి ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.



కుంభ రాశి
ఈ రాశివారు సోమరితనం వీడాలి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు మాటతీరులో మాధుర్యాన్ని కాపాడుకోవాలి. మీ తెలివితేటలు, మనస్సాక్షితో నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొచ్చు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.



మీన రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. మీరు మీ పాత స్నేహితుడిని కలుసుకుంటారు కొన్ని బాధల బరువును దించుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. కుటుంబం నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త