News
News
వీడియోలు ఆటలు
X

Venus Transit 2023: వృషభ రాశిలో ప్రవేశించిన శుక్రుడు, ఈ 6 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!

Shukra Gochar 2023: సుఖ, సంతోషాలనిచ్చే శుక్రుడు ఏప్రిల్ 6న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ ప్రభావంతో ఆరు రాశులవారికి అదృష్టమే అదృష్టం

FOLLOW US: 
Share:

Shukra Rashi Parivartan 2023:   ప్రతి నెలా గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. గ్రహాల కదలికలు అన్ని రాశులపైనా ప్రభావం చూపిస్తాయి. కొన్ని రాశులపై శుభ ఫలితాలను చూపిస్తే మరికొన్ని రాశులపై అశుభ ఫలితాలను సూచిస్తాయి. మరికొన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయి. సుఖ సంతోషాలనిచ్చే శుక్రుడు ఏప్రిల్ 6న వృషభరాశిలోకి ప్రవేశించాడు.  మే 2వ తేదీ వరకూ వృషభ రాశిలోనే సంచరిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను సూచిస్తోంది..ఆ రాశులేంటంటే..

మేష రాశి  (అశ్వని, భరణి, కృత్తిక 1 పాదాలు)

మేషరాశి వారికి రెండో స్థానంలో శుక్ర సంచారం కలిసొస్తుంది. మెరుగైన జీవన శైలి లభిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అందరికీ శుభసమయం

వృషభ రాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

వృషభ రాశిలోనే శుక్రసంచారం జరుగుతోంది. ఈ  సమయంలో ఈ రాశివారు చాలా సానుకూల మార్పులు చూస్తారు. జీవిత భాగస్వామితో బంధం మెరుగుపడుతుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. సౌలభ్యాలు పెరుగుతాయి..పనిలో ఆటంకాలు తొలగిపోతాయి.

Also Read: గుండు చేయించుకుంటున్నారా, ఇంతకీ దేవుడికి తలనీలాలు ఎందుకిస్తారో తెలుసా!

కర్కాటక రాశి  (పునర్వసు 4 పాదం,  పుష్యమి, ఆశ్లేష)

శుక్రుడు సౌఖ్యం , విలాసానికి అధిపతి. ఈ రాశి నుంచి 11 వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీకు అంతా మంచే జరుగుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 

కన్యా రాశి  (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పాదాలు)

కన్యా రాశికి శుక్రుడ 2,9 స్థానాల్లో ఉంటే మంచి జరుగుతుంది. ప్రస్తుతం శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నందున ఈ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. జాతకంలో తొమ్మిదవ ఇంట్లో శుక్రుని స్థానం ఉత్తమంగా పరిగణిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మతపరమైన ప్రదేశాలు  సందర్శిస్తారు. కుటుంబ సంబంధాలు సాధారణంగా ఉంటాయి.

మకరరాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

మకరరాశి వారికి శుక్రుడు 5, 10 గృహాలకు అధిపతి. ప్రస్తుతం ఈ రాశి నుంచి శుక్రుడు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీరు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతారు. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, సంగీతం, లలిత కళలు, నృత్యం, వినోదం వంటి  సృజనాత్మక రంగాలలో విజయం ఉంటుంది. పని సామర్థ్యంలో అభివృద్ధి ఉంటుంది.

Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాాదాలు)

కుంభ రాశి వారికి శుక్రుడు 4, 9 గృహాలకు అధిపతి. ప్రస్తుతం కుంభ రాశివారికి శుక్రసంచారం నాలుగో స్థానంలో ఉంది. ఈ శుక్ర సంచారము చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విలాసాలు, శారీరక సుఖాలు ఉంటాయి. వాహనం, ఆస్తుల కొనుగోలు గురించి ఆలోచిస్తారు. కెరీర్‌లో రాణిస్తారు. కొత్త ఆలోచనల కారణంగా, మీరు పనిలో యజమానిని మెప్పించగలుగుతారు

నోట్: ఆయా రాశుల్లో ఫలితాలు ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Published at : 06 Apr 2023 01:16 PM (IST) Tags: Shukra Rashi Parivartan 2023 Venus transit in tarus april 6 shukra rashi parivartan zodiac signs get benifits Venus Transit 2023

సంబంధిత కథనాలు

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?