Chanakya Neeti In Telugu : లోకంలో మనుషులంతా ఇలాగే ఉంటారు, అర్థం చేసుకోరూ!
అప్పటి పరిస్థితుల ఆధారంగా ఆచార్య చాణక్యుడు చెప్పిన మాటలు ఇప్పటికీ, ఎప్పటికీ ఆచరణీయం, అనుసరణీయంగానే ఉంటాయి. ముఖ్యంగా మనుషుల వ్వవహారశైలికి సంబంధించి చెప్పిన విషయాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి
Chanakya Neeti In Telugu : లోకం రీతి, మనుషుల తీరు ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో వివరించాడు ఆచార్య చాణక్యుడు.
నిర్థనం పురుషం వేశ్యాం ప్రజా భగ్నం నృపాం త్యజేత్
ఖగాః వీతఫలం వృక్షం భుకత్వా చాభాగతో గృహమ్
ఏ వస్తువులను అయినా, మనుషులను అయినా ఉపయోగానంతరం విడిచిపెట్టేస్తారన్నది చాణక్యుడి భావన. ధనాన్ని పొగొట్టుకుంటే పురుషుడిని వెలయాలు వదిలేస్తుంది. అప్పటివరకూ ప్రేమ ప్రదర్శించిన వెలయాలు..ఆ వ్యక్తి దగ్గర ధనం లేదని తెలిసి పట్టించుకోవడం మానేస్తుంది, విముఖత చూపిస్తుంది రాజు ఎప్పుడైతే శక్తి హీనుడు, గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నవాడు అయితే ప్రజలు పక్కనపెట్టేస్తారు, పట్టించుకోవడం మానేస్తారు పళ్లు, కాయలు ఇవ్వని చెట్లను పక్షులు విడిచిపెట్టేస్తాయి..ఆ చెట్టువైపు ఎవ్వరూ చూడరు . భోజనానికి ఇంటికి వచ్చిన అతిథి.. భోజనం చేసిన తర్వాత ఈ ఇంటికి విడిచిపెట్టి వెళ్లిపోతాడు తమ తమ పనులు నెరవేర్చుకోవడం పూర్తైపోతే ప్రజలు ఎవరితోనైనా సంబంధం తెంచేసుకుని వెళ్లిపోతారు. మనిషైనా,వస్తువైనా ఎవరికైనా ఉపయోగపడేవరకే...అది పూర్తైన దానిపై ఆకాంక్ష పోతుంది
Also Read: చాణక్య నీతి: పెళ్లికి ముందే ఈ నాలుగు విషయాలపై క్లారిటీ తెచ్చుకోవడం మంచిది
గృహిత్వా దక్షిణాం విప్రాన్త్యజని యజమానకమ్
ప్రాప్తవిద్యా గురుం శిష్యాఃదగ్ధారణ్యం మృగస్తథా!!
దక్షిణ తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత బ్రాహ్మణుడు..యజమాని ఇంటిని వదిలివెళ్లిపోతాడు. విద్యా ప్రాప్తి అయిపోయిన తర్వాత శిష్యుడు గురువుని వదిలి వెళతాడు.చదువు నేర్చుకున్నంతసేపే గురుకులంలో ఉంటాడు ఆ తర్వాత తన భవిష్యత్ పై దృష్టి సారిస్తాడు. కార్చిర్చుతో అడవి మండిపోతున్నప్పుడు అందులో ఉన్న జంతువులు అన్నీ అడవిని వదిలేసి వెళ్లిపోతాయి. అంటే ఎవ్వరైనా కానీ లబ్ది ఉన్నంతసేపు, అక్కడ ఏదైనా ఉపయోగం ఉన్నప్పుడు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లేందుకు ఏ మాత్రం ఆలోచించరు. లోకం రీత, మనుషుల తీరు ఇలాగే ఉంటుందని చాణక్యుడు బోధించాడు.
చరిత్ర పురుషుల్లో చాణక్యుడి స్థానం విశిష్టమైనది. అలాంటి వ్యక్తిని మళ్ళీ చరిత్ర చూడలేదు. బహుశా మళ్ళీ చూడటం సాధ్యం కాదేమో. రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేసి ప్రత్యర్థిని చిత్తు చేయగల ప్రజ్ఞ చాణక్యుడి సొంతం. తనను ఘోరంగా అవమానించిన నందరాజుల్ని అణగ దొక్కి, సామాన్యుడిగా బతుకుతున్న చంద్రగుప్తుణ్ని రాజుగా చేసిన ఘనత చాణక్యుడిది. వ్యతిరేక పరిస్థితుల్లోనూ చతురతతో లక్ష్యాన్ని సాధించడమే చాణక్యనీతి సూత్రం. కొన్ని సందర్భాల్లో విజయం కోసం అడ్డదారిలో వెళ్లినా తప్పులేదంటాడు చాణక్యుడు. కానీ ఎంచుకున్న మార్గం ద్వారా ఇతరులకు ఎలాంటి హాని కలగకూడదని స్పష్టం చేశాడు. అదే సమయంలో లోకం రీతి, మనుషుల తీరు గమనిస్తూ ముందుకు సాగాలని బోధించాడు..
Also Read: చాణక్య నీతి ప్రకారం ఈ 6 లక్షణాలు ఉన్నవారు మాత్రమే ధనవంతులు అవుతారు
Disclaimer:ఇక్కడ అందించిన సమాచారం పండితుల నుంచి విన్నవి, కొన్ని బుక్స్ నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.