చాణక్య నీతి: నిజాయిగా ఉండడం కూడా ముప్పే !



చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి స్వభావం,యోగ్యత ,దోషాలు,విద్య,వ్యాపార జీవితం,సంపద, వివాహం ఇలా అన్ని అంశాల గురించి ప్రస్తావించాడు.



జీవితంలో సక్సెస్ అవ్వాలనుకున్న వ్యక్తి తన పనిపై అంకిత భావంతో ఉండాలని, కృషి-విధేయత-నిజాయితీ కలగి ఉండాలని తన నీతిశాస్త్రంలో చెప్పాడు



అయితే నిజాయితీగా ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని..నిటారుగా ఉన్న చెట్టే అందుకు ఉదాహరణ అన్నాడు



నిటారుగా ఉన్న చెట్టును నరికివేయడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదని..ఎవ్వరైనా సులభంగా పడదోయగలరు



మితిమీరిన నిజాయితీతో ఉండే వ్యక్తి కూడా ఎందుకూ పనికిరానివాళ్ల కారణంగా కూడా బాధపడాల్సి ఉంటుందని, ఇతరులు తొందరగా వీరిని వినియోగించుకుంటారని బోధించాడు



నిజాయితీ ఉండకూడదన్నది చాణక్యుడి ఉద్దేశం కాదు..నిజాయితీ ఉండాలి కానీ ఆ నిజాయితీతో పాటూ పరిస్థితులను ఎదుర్కొనే తెలివితేటలు కూడా ఉండాలి



క్లిష్టమైన వ్యక్తులను ఎదుర్కొనే తెలివితేటలు లేకపోతే మీ ప్రణాళికలు, మీ ఆలోచనలను దొంగిలించేవారు, మిమ్మల్ని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందని హెచ్చరించాడు.



వ్యక్తికి విద్యా పరమైన విజ్ఞానంతో పాటు ఆచరణాత్మక జ్ఞానానికే కౌటిల్యుడు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు.



ఇతరుల చేతిలో ధనం ఉంటే మనకు ఉపయోగం ఎలా ఉండదో, అలాగే విజ్ఞానం కూడా పుస్తకాల్లో బందీ అయిపోతే ఎవరికీ మంచి జరగదు . అందుకే నిజాయితీ, విజ్ఞానం ఉంటే సరిపోదు..అవి ఎక్కడ ఎలా వినియోగించాలో తెలుసుకోవాలంటాడు చాణక్యుడు.



Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

వీటిని ఖాళీగా ఉంచకండి, దరిద్రం చుట్టుకుంటుంది

View next story