ఫ్లవర్వాజ్ ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఇది అనుబంధాల్లో అసంతృప్తిని సూచిస్తుంది. అనుబంధాల్లో అపార్థాలు ఏర్పడొచ్చు. ఇంట్లో ఫ్లవర్వాజ్ ఎప్పుడూ తాజా పువ్వులతో ఉంటే పాజిటివ్ ఎనర్జీ మాత్రమే కాదు ఇంట్లో ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయి. బకెట్ కేవలం స్నానానికి వాడే వస్తువు మాత్రమేకాదు. వాస్తును అనుసరించి ఖాళీ బకెట్ స్తబ్ధతకు, అభివృద్ధిలో ఆటంకాలను సూచిస్తుంది. బకెట్ ఎప్పుడు ఖాళీగా వదలెయ్యొద్దు, ఇంట్లో బకెట్ లో ఎప్పుడూ నీళ్లు లేదా ధాన్యం ఏదో ఒకటి నింపి ఉండాలి. వ్యాలెట్ కేవలం డబ్బు పెట్టుకునేది మాత్రమే కాదు. ఇది మీ కెరీర్, ఆర్థిక విషయాలకు ప్రతీక. వ్యాలెట్ లో ఎప్పుడూ కొంత డబ్బు పెట్టుకోవాలి. నిరంతరాయంగా మీకు డబ్బు వచ్చేందుకు ఈ చిట్కా పనిచేస్తుంది. ఇంట్లో ఉండే జార్స్, కంటైనర్స్ ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఇది వాటి హోల్డ్ చేసే సామార్థ్యాన్ని అవమాన పరిచినట్టవుతుంది. ఇల్లు సమృద్ధిగా ఉండాలంటే వాటిని ఖాళీగా ఉంచకూడదు. ఇంట్లో వాడే గ్రోసరీ తప్పకుండా సర్దిపెట్టుకోవాలి. Representational image:Pexels and pixabay