ఆగష్టు 30 or 31 రక్షాబంధన్ ఎప్పుడు



శ్రావణ పౌర్ణమి ఆగష్టు 30 బుధవారం ఉదంయ 10 గంటల 33 నిముషాలకు ప్రారంభమై ఆగష్టు 31 గురువారం ఉదయం 8 గంటలవరకూ ఉంది.



సాధారణంగా పండుగలకు సూర్యోదయానికి ఉన్న తిథిని లెక్కలోకి తీసుకుంటారు



రాఖీ పౌర్ణమి గురువారం జరుపుకోవాలని పంచాంగ కర్తలు నిర్ణయించారు.



అయితే ఈ వేడుకను కొందరు సాయంత్రం సెలబ్రెట్ చేసుకుంటారు..వారంతా ఆగష్టు 30 రోజునే చేసుకోవచ్చని సూచిస్తున్నారు.



దేవతలకు, రాక్షసుల కు మధ్య దాదాపు పన్నెండేళ్లు యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు ఇంద్రుడుతన పరివారాన్ని తీసుకెళ్లి అమరావతిలో తలదాచుకుంటాడు.



దేవేంద్రుడు యుద్ధంలో పాల్గొనేలా ఉత్సాహాన్ని నింపుతూ శ్రావణ పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్ష కడుతుంది భార్య శచీదేవి



ఇంద్రాణి కట్టిన రక్షను గమనించి దేవతలంతా వారు పూజించి తీసుకొచ్చిన రక్షలు ఇంద్రుడికి కడతారు. అప్పుడు యద్ధంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు



శ్రీ మహావిష్ణువుని తనతో తీసుకెళ్లేందుకు శ్రీ మహాలక్ష్మి బలిచక్రవర్తికి రాఖీ కట్టిందని చెబుతారు.



శిశుపాలుడిని వధించే సమయంలో శ్రీ కృష్ణుడి వేలికి గాయం అయితే ద్రౌపది తన చీర చెంగు చించి కట్టిందంటారు



ఇంకా రక్షాబంధన్ వెనుక ఇంకా ఎన్నో పురాణగాథలున్నాయి
Images Credit: Pixabay