రాఖీ రైట్ హ్యాండ్ కే ఎందుకు కట్టాలి



హిందూమతంలో ఎడమ చేతికి చెడు అనే అర్థం ఉంది. దీనిని అశుభమైనదిగా పరిగణిస్తారు. ఇది మూఢ నమ్మకం అని కొందరు అనుకుంటారు కానీ దీనికి ఆధ్యాత్మికం, సైన్స్ పరంగా కూడా కొన్ని కారణాలున్నాయి.



భారతీయులు ఎడమచేతిని శుభ్రపరిచే ప్రయోజనాల కోసం వినియోగిస్తారు.



హిందువులు చెప్పుకునే సవ్య, అపసవ్య దిశల ప్రకారం..సవ్యదిశ విశ్వాసానికి అనుగుణంగా ఉంటుంది. అపసవ్య దిశను నెగిటివ్ ఎనర్జీగా భావిస్తారు. దీనిద్వారా శారీక రుగ్మతలు వస్తాయని విశ్వసిస్తారు.



పురాతన తమిళ సాహిత్యం కూడా కుడిచేతికే రాఖీ ఎందుకు కట్టాలో ఓ కారణం చెబుతుంది. పులులు సాధారణంగా ఎడమ వైపు కాకుండా కుడి వైపున పడే వేటను మాత్రమే తింటాయి. చాలా సంస్కృతులు, భాషల్లో..కుడిని అదృష్టంగా, ఎడమను దైవదూషణగా చెబుతారు.



ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కుడిచేతికి బంధనం కట్టడం ద్వారా వాత, పిత్త, కఫం నియంత్రణలో ఉంటాయని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. సోదరి రాఖీ కట్టినప్పుడు ఈ మూడు శరీర అంశాలు క్రమబద్ధీకరించి ఆరోగ్యం మెరుగుపడుతుంది.



నాడి శాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఇడా, పింగళ, సుషుమ్న అనే మూడు నాడిలు ఉంటాయి. మూడింటిలో పింగళ నాడి కుడి వైపున ఉంటుంది. ఇది పురుషత్వంతో సంబంధం కలిగి ఉంటుంది.



మగవారిలో పింగళనాడి చైతన్యవంతమైతే పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే సోదరుడి కుడి చేతికి రాఖీ కట్టాలని చెబుతారు.



ఆగష్టు 31 గురువారం రక్షా బంధన్



Images Credit: Pixabay