చాణక్య నీతి: వైరాగ్యం కూడా క్షణమే ఉంటుంది



ధర్మా అఖ్యానే శ్మశానే చ రోగీణాం యా మతిర్భవేత్
సా సర్వదైవ తిష్ఠేచ్చేత్ కో న ముచ్చేత బన్ధనాత్



ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా వైరాగ్యం గురించి చెబుతున్నాడు



ఏదైనా వస్తువు లేదా పదార్థాన్ని చూస్తే కలిగే జ్ఞానం క్షణ భంగురమే



ఆ జ్ఞానం ఎప్పటికీ నిలిచి ఉంటుందని అస్సలు అనుకోకూడదు



ధర్మానికి సంభందంచిన ప్రవచనాలు విన్నప్పుడు ఈ జీవితం ఇలా గడిచిపోతే చాలు అనిపిస్తుంది



జబ్బుతో బాధపడేవారిని చూసినా , శ్మశానంలో జరుగుతున్న కర్మలు చూసినా వ్యక్తి స్వభావంలో మార్పు వస్తుంది



ఇవన్నీ చూసినప్పుడు వైరాగ్యం పుడుతుంది, ఈశ్వరుడిపై భక్తి పెరుగుతుంది



కానీ వైరాగ్యం కూడా క్షణకాలమే అంటాడు ఆచార్య చాణక్యుడు..



వైరాగ్యపు భావన పూర్తిగా నిలిచిఉన్నప్పుడే జీవికి మోక్షం లభిస్తుంది
Images Credit: Pixabay