రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే సంబంధం...అందుకే ఈ పండుగకు రక్షా బంధన్ అని పేరు వచ్చింది.
సోదరి తన సోదరుని చేతికి పవిత్రమైన దారం కట్టేటప్పుడు దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది.
సోదరుడికి ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సంతోషకరమైన జీవితాన్ని కోరుకునే సాంప్రదాయం ఇది.
సోదరుడి నుదిటిపై తిలకం దిద్ది రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఆ తర్వాత హారతిస్తుంది. ఆమెకు జీవితాంతం అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు సోదరుడు.
సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టేటప్పుడు జపించాల్సిన మంత్రం యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేనత్వామభిబధ్నామి రక్షే మా చలమాచల॥
ఎంతో బలవంతుడైన బలిచక్రవర్తినే బంధించిన విష్ణుశక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కడుతున్నాను. ఈ శక్తితో నువ్వు చల్లగా వర్ధిల్లాలి అని అర్థం
తనతో పాటూ భర్తను తీసుకెళ్లేందుకు వచ్చిన మహాలక్ష్మి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టిందని భవిష్య పురాణం చెబుతోంది. అందుకే ఈ శ్లోకం చదువుతూ సోదరులకు రాఖీ కట్టాలని పండితులు చెబుతారు.