News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chanakya Niti: చాణ‌క్య నీతి ప్ర‌కారం ఈ 6 ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు మాత్రమే ధనవంతులు అవుతారు

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి ధనవంతుడు కావడానికి పాటించవలసిన అన్ని లక్షణాలను పేర్కొన్నాడు. ఆచార్య చాణక్య ప్రకారం ధనవంతులు కావాలంటే ఏ ల‌క్ష‌ణాలు ఉండాలి?

FOLLOW US: 
Share:

Chanakya Niti: ఒక వ్యక్తి విజయం సాధించాలంటే, అతను తన జీవితంలో కొన్ని చాణక్యుడి సూత్రాలు, విధానాలను అనుసరించాలి. చాణక్యుడి విధానానికి వ్యక్తిని విజయవంతం చేసే శక్తి ఉంది. చాణక్యుడి నీతిని అనుసరించే వ్యక్తి జీవితంలో పురోగతి, శ్రేయస్సును అనుభవిస్తాడు. మనిషి ధనవంతుడు కావాలంటే చాణక్యుడి సూత్రాలన్నీ పాటించాలా?

కష్టపడే త‌త్వం
చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే, అతను కష్టపడి పని చేసే మార్గాన్ని అనుసరించాలి. ఎందుకంటే కష్టపడి పనిచేసే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ పేదరికాన్ని ఎదుర్కొనే అవ‌కాశం ఉండ‌దు. కష్టపడి పనిచేసేవాడు పేదవాడైనా, అది తాత్కాలికమే. ఎందుకంటే అలాంటి వారికి లక్ష్మీదేవి ప్రత్యేక కృపను ప్రసాదిస్తుంది.

Also Read : ఎవ‌రైనా స‌రే జీవితంలో ఈ 4 త‌ప్పులు చేయ‌కూడ‌దు. చేస్తే జీవిత‌మంతా బాధ ప‌డాల్సిందే!

నిజాయితీ
ధనవంతులుగా ఉండాలంటే కష్టపడి పనిచేయడమే కాకుండా నిజాయితీ కూడా అవసరమని గుర్తుంచుకోండి. పని పట్ల నిజాయితీ ఉన్న వ్యక్తి తన పనిలో ఎప్పుడూ వైఫల్యాన్ని అనుభవించడు. చిత్తశుద్ధితో చేసే ఏ పని అయినా మనిషిని విజయపథంలో నడిపిస్తుందనడంలో సందేహం లేదు.

బాధ్యత
తన భుజాలపై బాధ్యత ఉన్న వ్యక్తి తన అన్ని కార్యకలాపాలలో ఖచ్చితంగా విజయం సాధించి పురోగతి దిశ‌గా ప‌య‌నిస్తాడు. సరైన సమయంలో తన బాధ్యతలను నెరవేర్చే వ్యక్తి ఎప్ప‌టికీ పేదవాడు కాలేడు. అనుకోని సంద‌ర్భాల్లో అలాంటి వ్యక్తులు పేదరికాన్ని ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌చ్చినా, వారు దానిని ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

క్రమశిక్షణ, సహనం
ధనవంతుడు కావాలనుకునే వ్యక్తి క్రమశిక్షణ, సహనం కలిగి ఉండాలి. ధనవంతులు కావడానికి ఇది చాలా ముఖ్యమైన అంశం. తన జీవితంలో ఎదుర‌య్యే చెడు సమయాలను ఓపికగా ఎదుర్కొనేవాడు తన పేదరికాన్ని కూడా ఓపికగా ఎదుర్కొంటాడు.

మంచి ప్రవర్తన
ధనవంతుడు కావాలంటే మంచి ప్రవర్తనను అలవర్చుకోవడం చాలా ముఖ్యం. మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి సమాజంలో గౌర‌వం పొంద‌డం ద్వారా ఉన్నత స్థానాన్ని పొందుతాడు. ఇది అతని విజయానికి కూడా తోడ్పడుతుంది. అలాంటి వారు కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం కాకుండా ప్రవర్తనలోనూ వాటిని ఆచ‌రిస్తారు. ఇత‌రుల‌ను క‌ష్ట‌పెట్ట‌కుండా మృదువుగా ​​మాట్లాడే వ్య‌క్తి కూడా ధనవంతుడు అవుతాడనడంలో సందేహం లేద‌ని చాణ‌క్యుడు స్ప‌ష్టంచేశాడు.

Also Read : విజ‌య‌వంత‌మైన వ్యాపార‌వేత్త‌ కావాలంటే ఈ లక్షణాలు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి!

లక్ష్యంపైనే దృష్టి
ఒక వ్యక్తి విజయం సాధించాలంటే, ఆ వ్యక్తి వెనుక ఒక గురువు ఉండాలి. అతని ముందు ఒక లక్ష్యం ఉండాలి. అప్పుడే విజయం సాధిస్తాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష్య సాధ‌న కోసం కష్టపడి పని చేస్తే, మనం లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలుగుతాడు. ఆ లక్ష్యం అతన్ని పేదరికం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కూడా సహాయపడుతుంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Published at : 25 Aug 2023 07:01 AM (IST) Tags: Wealth Chanakya Niti become rich 6 Types Of People

ఇవి కూడా చూడండి

TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్ - ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత

TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్ - ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత

Vastu Tips : ముందు ఈ వ‌స్తువుల‌ను ఇంట్లోంచి తీసేస్తే, పురోగ‌తి దానంతట అదే మొద‌ల‌వుతుంది.!

Vastu Tips : ముందు ఈ వ‌స్తువుల‌ను ఇంట్లోంచి తీసేస్తే, పురోగ‌తి దానంతట అదే మొద‌ల‌వుతుంది.!

Vastu Tips In Telugu: చనిపోయిన వారి ఫొటోలు మీ ఇంట్లో ఏ దిక్కున పెట్టారు!

Vastu Tips In Telugu:  చనిపోయిన వారి ఫొటోలు మీ ఇంట్లో ఏ దిక్కున పెట్టారు!

Horoscope Today 30 September 2023: ఈ రాశులవారు మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నించండి, సెప్టెంబరు 30 రాశిఫలాలు

Horoscope Today 30 September 2023:   ఈ రాశులవారు మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నించండి, సెప్టెంబరు 30 రాశిఫలాలు

Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?

Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ