(Source: ECI/ABP News/ABP Majha)
Chanakya Niti: ఎవరైనా సరే జీవితంలో ఈ 4 తప్పులు చేయకూడదు. చేస్తే జీవితమంతా బాధ పడాల్సిందే!
జీవితంలో కొన్ని తప్పులు చేయకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఈ తప్పులు చేస్తే జీవితం నరకం అవుతుంది. చాణక్యుడు పేర్కొన్న ఆ తప్పులు ఏంటంటే..?
Chanakya Niti: ఆచార్య చాణక్యుడి ప్రతి మాట, తత్వశాస్త్రం, బోధ మన జీవితానికి స్ఫూర్తి. మనం ఆయన సూత్రాలను అనుసరిస్తే జీవితంలో గొప్ప మార్పులను చూడవచ్చు. అదేవిధంగా, చాణక్యుడు తన సూత్రాలలో ఏ వ్యక్తి ఏ విషయాలకు దూరంగా ఉండాలో పేర్కొన్నాడు. వీటికి దూరంగా ఉండకపోతే సమస్యలు, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి ఏ అంశాలకు దూరంగా ఉండాలి..?
1. చాణక్య నీతిలోని ఒక శ్లోకం
‘‘అనభ్యసే విషం, శాస్త్రమజేరే భోజనం
విష్మాన్ దైరిద్రస్య విష్మాన్ కంఠవృద్ధిషమ్''
తాత్పర్యము: సాధన లేని జ్ఞానము విషముతో సమానమని, శాస్త్రము లేని ఆహారము అజీర్ణమని, పేదవారికి పెద్దల వేడుక, అందమైన స్త్రీలు ముసలివారికి విషము అని అర్థం.
2. వృద్ధులు చేయకూడనవి
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో వృద్ధులు యువతులను వివాహం చేసుకోకూడదని పేర్కొన్నాడు. ఎందుకంటే వృద్ధుల వయస్సు యువతుల వయస్సు మధ్య చాలా అంతరం ఉంది. వృద్ధుల కోరికలు వేరు, యువతుల కోరికలు వేరు. వృద్ధులు యువతుల కోరికలను తీర్చలేరు లేదా వారి మనోభావాలకు అనుగుణంగా ఉండలేరు. ఇది ఇద్దరి జీవితాల్లో విషాదాన్ని, బాధను సృష్టిస్తుంది.
3. పేద ప్రజలు హాజరు కాకూడని కార్యక్రమాలు
చాణక్యుడు ప్రకారం, పేదలు వీలైనంత వరకు ధనవంతుల ఇంటి కార్యక్రమాలకు లేదా పెద్ద కార్యక్రమాలకు వెళ్లకూడదు. ఎందుకంటే పేద ప్రజలకు ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకు వెళ్లాలంటే మంచి దుస్తులు, నగలు కావాలి. వారికి వాటిని ధరించే స్తోమత లేకపోవచ్చు. ఇది వారిని అవమానించటానికి కారణం కావచ్చు. ఈ కారణంగా పేద ప్రజలు ఎప్పుడూ పెద్ద లేదా ధనవంతుల ఇళ్లకు వెళ్లకూడదని చాణక్యుడు తెలిపాడు.
4. అభ్యాసం లేకుండా పొందిన జ్ఞానం
ఎలాంటి అభ్యాసం లేకుండా సంపాదించిన జ్ఞానం విలువలేనిది. కొత్త విషయాలను అభ్యసించినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు, మన జ్ఞానం పెరుగుతుంది. అభ్యాసం లేకుండా సంపాదించిన జ్ఞానం సరైన సమయంలో సద్వినియోగం కాదు. ఫలితంగా సమస్య మరింత జఠిలం కావచ్చని చాణక్యుడు స్పష్టంచేశాడు.
5. అటువంటి పరిస్థితుల్లో ఆహారం తినవద్దు
మీరు ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే లేదా ఏదైనా కారణం వల్ల మీకు కడుపు ఉబ్బరం లేదా కడుపు నొప్పి ఉంటే అటువంటి పరిస్థితిలో ఆహారం తీసుకోకండి. అటువంటి సందర్భంలో ఆహారం తినడం విషంతో సమానం. ఈ సమయంలో తినకూడదు.
Also Read : తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఈ తప్పు చేయకండి!
ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఏ వ్యక్తి అయినా పై తప్పులు చేయకూడదు. అలా కాకుండా చేస్తే అతను సమస్యల సుడిగుండంలో కూరుకుపోతాడు. అందువల్ల ఆయా సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Also Read : జీవితంలో చేసే ఈ 2 తప్పుల వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు