Bha Bha Ba OTT: ఓటీటీకి వచ్చే వారమే 'భా భా బా'... మలయాళ యాక్షన్ కామెడీలో మోహన్ లాల్ కూడా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Bha Bha Ba OTT Release Date: మలయాళ హీరో దిలీప్ నటించిన కామెడీ సినిమా 'భా భా బా'. ఇందులో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ సైతం ఓ పాత్ర చేశారు. ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందంటే?

మలయాళ హీరో దిలీప్ నటించిన కామెడీ సినిమా 'భా భా బా'. ఇందులో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ సైతం ఓ పాత్ర చేశారు. డిసెంబర్ 18న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయితే ఇప్పుడు అభిమానులు ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. చివరకు 'భా భా బా' ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం?
'భా భా బా' ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతుంది?
'భా భా బా' సినిమాను థియేటర్లలో చూడటానికి మిస్ అయిన వారికి ఒక శుభవార్త. ఈ సినిమాను త్వరలో ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. వచ్చే వారం నుండి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది. జనవరి 16న ఓటీటీలో విడుదల అవుతుంది. రాత్రి 12 గంటల నుండి సినిమా అందుబాటులో ఉంటుంది. 'భా భా బా' ZEE5లో స్ట్రీమ్ అవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో వస్తుంది. ప్రస్తుతానికి ఈ సినిమా ఇతర దక్షిణ భారత భాషల్లో ఓటీటీ వీక్షకులకు అందుబాటులో ఉంటుందా? లేదా? అనే దాని గురించి స్పష్టమైన సమాచారం లేదు.
View this post on Instagram
బాక్సాఫీస్ బరిలో 'భా భా బా'కు ఎన్ని కలెక్షన్లు వచ్చాయంటే?
'భా భా బా' థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకులనుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది ఈ స్పూఫ్ కామెడీని ఇష్టపడగా, మరికొందరు పెద్దగా ఇష్టపడలేదు. సినిమాలో మోహన్ లాల్ చిన్న పాత్ర పోషించినప్పటికీ... ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ట్రైడ్ పోర్టల్ వెబ్‌సైట్ ప్రకారం మంచి ఓపెనింగ్ వచ్చినప్పటికీ... తర్వాత వసూళ్లు తగ్గాయి. సినిమా విడుదలైన 14వ రోజున ఈ సినిమా భారత దేశంలో కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. మొదటి 13 రోజుల్లో సినిమా దాదాపు 22.95 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 14 రోజుల్లో మొత్తం వసూలు 23.10 కోట్ల రూపాయలుగా ఉంది.
Also Read: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
'భా భా బా'లో నటీనటులు ఎవరెవరు?
'భా భా బా'లో దిలీప్ ప్రధాన పాత్ర పోషించారు. సహాయక పాత్రల్లో వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్, రెడిన్ కింగ్ స్లే, సాండీ మాస్టర్, బాలు వర్గీస్, సిద్ధార్థ్ భరతన్, బైజు సంతోష్, సర్న్య పొనవన్ ఉన్నారు. ఈ సినిమాకునూతన దర్శకుడు ధనుంజయ్ శంకర్ దర్శకత్వం వహించారు.





















