అన్వేషించండి

Bathukamma 2022: బతుకమ్మని శివలింగం ఆకారంలో ఎందుకు పేరుస్తారు!

Bathukamma 2022: భూమితో,జలంతో మనుషుల అనుబంధాన్ని గుర్తుచేస్తూ జరుపుకునే పుండుగ బతుకమ్మ. ప్రకృతిలో దొరికే రంగురంగు పూలతో బతుకమ్మని తయారుచేసి ఆరాధిస్తారు. ఇంతకీ బతుకమ్మని ఇలాగే ఎందురు పేర్చుతారు!

Bathukamma 2022: బతుకమ్మని ఇలా పేర్చడం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది . తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వేములవాడ చాళుక్యుల సామంతులుగా ఉండేవారు. క్రీ.శ 973లో చాళుక్య రాజైన తైలపాడు.. రాష్ట్రకూటుల చివరి రాజైన కర్కుడిని వధించి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పి కుమారుడు సత్యాశ్రయుడికి పట్టాభిషేకం చేయించాడు. అప్పటి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవాలయముంది. ప్రజలు ఆ దేవిని విశేషంగా ఆరాధించేవారు. చోళరాజులు కూడా రాజరాజేశ్వరిని విశ్వసించేవారు.

Also Read:  బతుకమ్మని పూలతోనే ఎందుకు పేరుస్తారు, తప్పనిసరిగా వినియోగించాల్సిన పూలు ఏవి!

సత్యాస్రాయుడితో యుద్ధం..
క్రీ.శ 985 నుంచి 1014 వరకు రాజ రాజ చోళుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ తర్వాత వచ్చిన రాజేంద్ర చోళుడు...  సత్యాశ్రయుడిని యుద్ధంలో ఓడించి వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేశాడు. ఈ ఆలయంలోని ఉన్న భారీ శివలింగాన్ని రాజేంద్ర చోళుడు తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. ఆ శివలింగాన్ని 1010లో నిర్మించిన బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించారు. పార్వతిసమేతుడై ఉన్న శివలింగాన్ని వేరుచేసి రాజేంద్ర చోళుడు బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించినట్టు తమిళ శిలాశాసనాల్లోనూ ఉందని చెబుతారు.

బృహదమ్మ పేరు మీద బతుకమ్మ
వేములవాడ నుంచి శివలింగాన్ని వేరుచేసి తంజావూరులోని బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించడం ఇక్కడి ప్రజలను కలిచివేసింది. బృహదమ్మ(పార్వతి) నుంచి శివుని లింగాన్ని వేరుచేసినందుకు దుఃఖిస్తూ...తమ బాధను చోళులకు తెలియజేసేందుకు శివలింగాకారంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచీ ఏటా బతుకమ్మను ఇలా పూలతో పేర్చి మధ్యలో గౌరమ్మని తలపించేలా పసుపుముద్దను పెడతారు. జాములు గడుస్తున్నాయి కానీ ఇంకా శివుడు రాలేదంటూ ఈ పాట పాడుతారు...

ఒక్కేసి పూవ్వేసి చందమామ..ఒక్క జాములాయె చందమామ
జాముజాముకూ చందమామ..శివుడు రాకాపాయే చందమామ
రెండేసి పూలేసి చందమామ..రెండు జాములాయె చందమామ
జాముజాముకూ చందమామ..శివుడు రాకాపాయే చందమామ
మూడేసి పూలేసి చందమామ..మూడు జాములాయె చందమామ
జాముజాముకూ చందమామ...శివుడు రాకాపాయే చందమామ
నాలుగేసి పూలేసి చందమామ..నాలుగు జాములాయె చందమామ
శివపూజ వేలాయె చందమామ..శివుడు రాకాపాయే చందమామ
ఐదేసి పూలేసి చందమామ..ఐదు జాములాయె చందమామ
శివపూజ వేలాయె చందమామ..శివుడొచ్చి కూర్చునే చందమామ

----------------------------------

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 

రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే
రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 

వెండి బింద తీసుక వెలది నీళ్లకు వోతే
వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 

బంగారు బింద తీసుక బామ్మా నీళ్లకు వోతే
భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 

పగిడి బింద తీసుక పడతి నీళ్లకు వోతే
పరమేశు డెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 

ముత్యాల బింద తీసుక ముదిత నీళ్లకు వోతే
ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget