By: ABP Desam | Updated at : 29 Jun 2022 07:12 PM (IST)
ప్రజలు నిలదీస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆవేదన
Darsi YSRCP Mla : గడప గడపకూ వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ కి చెందిన దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్‌సీపీ నియోజకవర్గ ప్లీనరీలో మాట్లాడిన ఆయన ుపలు కీలక వ్యాఖ్యలు చేశారు. నవరత్నాలు అమలు చేయండ వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే పేరు వస్తోందన్నారు. ఎమ్మెల్యేలను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. రోడ్లు, డ్రైనేజీలు కావాలని అడుగుతున్నారని.. వారికి సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు.
హైదరాబాద్‌లో రఘురామను ప్రశ్నించొచ్చు - ఏపీ సీఐడీకి హైకోర్టు అనుమతి !
ఇటీవల సీఎం జగన్ తన గ్రాఫ్ బాగుందని.. ఎమ్మెల్యేల గ్రాఫ్ పెంచుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ కామెంట్స్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాలంటే కనీసం నాలుగు సీసీ రోడ్లు వెయ్యాలని్నారు. వైఎస్ఆర్‌సీపీకి అండగా ఉన్న కార్యకర్తలను ఆదుకోవాలన్నారు. కార్యకర్తలకు పనులు ఇచ్చి వారిని అప్పుల పాలు చేశానని దర్శి ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గంలో పనులు చేసిన కార్యకర్తలకు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‍లో ఉన్నాయన్నారు.
బందర్ వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ ఈ సారి కిట్టూకే - తేల్చేసిన కొడాలి నాని !
రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బిల్లులను మంజూరు చేయించాలని దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. కార్యకర్తల్లో ఆనందం నింపాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. బయటికి బాగున్నంతగా కార్యకర్తల జీవితాలు లోపల బాగా లేవన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా గడపగడపకు వెళ్తే సమస్యలపై అడుగుతున్నారని వేణుగోపాల్ తెలిపారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదన్నారు.
బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి! టీఆర్ఎస్ మాజీ ఎంపీతో బండి సంజయ్, తరుణ్ ఛుగ్ భేటీ?
ఇదే ప్లీనరీకి హాజరైన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. చేసిన పనులకు బిల్లులు రాక పార్టీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బిల్లులు మంజూరు చేసి కార్యకర్తలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు ఆపకుండా చేస్తున్న సమయంలో కల్పించుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. సీఎం జగన్‌కు కొన్ని ప్రాధాన్యాలు ఉన్నాయని, సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని సర్ది చెప్పే యత్నం చేశారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి, ఎంపీ మాగుంట వ్యాఖ్యలతో సభలో కాసేపు కలకలం చోటు చేసుకుంది
Sajjala On Gorantla : ఫిర్యాదు లేదు - చర్యలుండవ్ ! గోరంట్ల మాధవ్ విషయంలో సజ్జల క్లారిటీ
మునుగోడులో ఎవరి బలం ఎంత- ఈ సారి ఛాన్స్ ఎవరికి ఉండొచ్చు?
Rajagopal Reddy Resignation: రాజీనామా లేఖ సమర్పించిన రాజగోపాల్ రెడ్డి - వెంటనే ఆమోదించిన స్పీకర్ పోచారం
KCR Letter : నీతి ఆయోగ్ నిరర్థక సంస్థ - అందుకే హాజరు కావడంలేదని మోదీకి కేసీఆర్ లేఖ !
Addanki Dayakar : తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పంచాయతీ - అద్దంకి దయాకర్పై చర్యలకు సీనియర్ల డిమాండ్ !
హైదరాబాద్‌లో నెంబర్ ప్లేట్ లేకుండా బండిపై తిరుగుతున్నారా? మీరు చిక్కుల్లో పడ్డట్టే!
Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!
Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'
Google Outage: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు! ట్విటర్లో ఫిర్యాదుల వెల్లువ