అన్వేషించండి

Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?

YSRCP : తిరమల లడ్డూ కల్తీ అంశంపై వైసీపీకి కాస్త ఊరట లభించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ప్రజలకు తమ వాదన మరింత బలంగా వినిపించుకునే అవకాశం లభించింది. కానీ దర్యాప్తు మాత్రం ఆగే అవకాశాలు కనిపించడం లేదు.

YCP got some relief on the Tirumala Laddu adulteration issue : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశం సప్రీంకోర్టుకు చేరింది. సిట్ విచారణకు చంద్రబాబు ఆదేశించారు. సిట్ నియమించారు. అయితే సిట్ విచారణ వద్దని కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ఇద్దరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు వైసీపీకి నైతిక బలాన్ని ఇచ్చాయి.ఇప్పటి వరకూ తమ వాదన ఎలా చెప్పుకోవాలో వారికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే ఆధారాలేవని ప్రశ్నించిందని.. చంద్రబాబు వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందన్నట్లుగా వ్యాఖ్యానించడంతో వైసీపీ కాస్త రిలీఫ్ ఫీలయ్యాయి. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇస్తే మంచిదని సుప్రీంకోర్టు చేసిన  వ్యాఖ్యలను బట్టి చూస్తే..దర్యాప్తు సీబీఐ లేదా మరో కేంద్ర దర్యాప్తు సంస్థ చేతికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. 

సిట్ దర్యాప్తు - సీబీఐ దర్యాప్తులో తేడాలు ఏముంటాయి ?

లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై ఇప్పటికే సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ సిట్ దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. గురువారం తదుపరి విచారణలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సిట్ దర్యాప్తు కొనసాగుతున్నందున కొనసాగించి..  నివేదిక ఇచ్చిన తర్వాత అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావొచ్చని చెప్పవచ్చని కొంత మంది న్యాయనిపుణలు చెబతున్నారు. ఒక వేళ అసలు ఏపీ ప్రభుత్వాధినేత ముందుగానే చెప్పారు కాబట్టి సిట్ దర్యాప్తుపై నమ్మకం ఉండదని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర దర్యాప్తు సంస్థలకు సిఫారసు చేయవచ్చు. పిటిషనర్ కోరినట్లుగా తామే దర్యాప్తును పర్యవేక్షిస్తామని చెప్పడం అసాధారణం. ఒక వేళ అలా చెప్పినా దర్యాప్తు అధికారులు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు చెందిన వారే ఉంటారు. అందుకే దర్యాప్తు చేసేది ఎవరైనా పెద్దగా తేడా ఉండదని కొంత మంది భావన.

లడ్డూ కల్తీ జరిగిందనడానికి ఆధారాలేవి ? శ్రీవారి ప్రసాద వివాదంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

టెండర్ల మానిప్యులేషన్ జరిగినట్లుగా ఇప్పటికే ఆధారాలు

తిరుమలలో జరిగిన లడ్డూ నెయ్యి టెండర్ల విషయంలో భారీ గోల్ మాల్ జరిగిందని ఇప్పటికే ఆధారాలు బయటకు వచ్చాయి. ఏఆర్ డెయిరీకి నిబంధనల ప్రకారం అర్హత లేకపోయినా.. ఉద్దేశపూర్వకంగా టెండర్ నిబంధనలు సవరించి ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే నెయ్యి కూడా ఏఆర్ డెయిరీ నుంచి రావడం లేదు.. దగ్గర్లోని శ్రావణి డెయిరీ అనే సంస్థ నుంచి వస్తున్నాయని కూడా వస్తున్నయని గుర్తించారు. అలాగే నెయ్యిని సరైన టెస్టులు చేయకుండానే లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్నరన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.  ఇప్పటికే సిట్ అధికారులు వీటన్నింటిపై పరిశీలన జరిపారు. అధికారుల నుంచి అన్ని వివరాలు తీసుకున్నారు. 

కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?

టీటీడీలో అక్రమాలు బయటకు వస్తే వైసీపీకి ఇబ్బందే !

వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున టీటీడీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క టీటీడీ చైర్మన్ మూడున్నర లక్షల టిక్కెట్లు తన కోటాలో మంజూరు చేశారుని.. రోజా, పెద్దిరెడ్డి వేల కొద్దీ టిక్కెట్లు తీసుకుని అమ్ముకున్నారన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. ఒక వేళ నెయ్యి కల్తీ కేసులో తీగ లాగితే..ఈ మొత్తం వ్యవహారాలు బయటకు వస్తే అధికారికంగా బయట పెడితే కేసులు అయ్యే సంగతేమో కానీ.. మందు హిందూ భక్తుల్లో వైఎస్ఆర్‌సీపీకి మరింత మైనస్ అవుతుంది. అందుకే సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనే అంతా అయిపోలేదని ముందు ముందు చాలా కథ ఉందని టీడీపీ నేతలంటున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Mike Tyson Vs Jake Paul: సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Mike Tyson Vs Jake Paul: సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Embed widget